Reading Time: 2 minutes

అబ్బా సాయిరాం.. ఆఫ్ఘన్‌తో 3వ టీ20లో బుడ్డోడు ఆడేది ఫిక్స్: ప్లేయింగ్XI ఇదే?

Caption of Image.

Team India Playing XI: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు (గురువారం, సెప్టెంబర్ 17న) సాయంత్రం భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే 2–0 తేడాతో సిరీస్‌ను జేబులో వేసుకున్న ఇండియా, ఈ ఆఖరి పోరులో బెంచ్ స్ట్రెంగ్త్‌ను పరీక్షించేందుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో 160 పరుగుల టార్గెట్‌ను కేవలం 14.5 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా, ఈసారి జట్టులో భారీ మార్పులు చేయబోతోంది.

వైభవ్ ఎంట్రీ.. అభిషేక్‌కు రెస్ట్:

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రాణించిన అభిషేక్ శర్మ స్థానంలో, దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని బరిలోకి దించనున్నారు. స్వదేశంలో వైభవ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది.

* శాంసన్ ఫైర్ పవర్: గత మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 57 రన్స్ తో చెలరేగిన సంజు శాంసన్ ఓపెనర్‌గా కొనసాగుతాడు.
* కిషన్ జోరు: 42, 38* పరుగులతో ఫాంలో ఉన్న ఇషాన్ కిషన్ నంబర్-3 స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు.

బిగ్ స్కోర్ పై శ్రేయస్ కన్ను: 

* కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (2 మ్యాచ్‌ల్లో 19 రన్స్), వైస్ కెప్టెన్ తిలక్ వర్మలకు ఇప్పటి వరకు బ్యాటింగ్ చేసేందుకు సరిగ్గా టైమ్ దొరకలేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ చేయాలని వీరు భావిస్తున్నారు.

* శివమ్ దుబేకి వార్నింగ్: బౌలింగ్‌లో దారుణంగా విఫలమవుతున్న దూబే ఈ మ్యాచ్‌లోనైనా పుంజుకోవాల్సి ఉంది.

* నితీష్ రాంపేజ్: గత మ్యాచులో 3/24 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించిన నితీష్ కుమార్ రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

* అక్షర్ పటేల్ కి అడ్వాంటేజ్: ఢిల్లీ వికెట్‌పై ఐపీఎల్‌లో 21 వికెట్లు తీసిన అనుభవం ఉన్న అక్షర్ పటేల్‌నే సుందర్ కంటే ముందుగా తుది జట్టులోకి తీసుకోనున్నారు.

బౌలింగ్ ఎటాక్: బుమ్రాకి రెస్ట్: 

* సిరీస్ ఇప్పటికే భారత్ సొంతం కావడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి, యష్ ఠాకూర్‌ను బరిలోకి దించబోతున్నట్లు కెప్టెన్ శ్రేయస్ పేర్కొన్నాడు. 

* అర్ష్‌దీప్ లీడర్‌షిప్: 93 మ్యాచ్‌ల్లో 140 వికెట్లతో పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ పేస్ విభాగాన్ని నడిపిస్తాడు.

* స్పిన్ బాధ్యతలు: వరున్ చక్రవర్తి సిరీస్‌కు దూరం కావడంతో రవి బిష్ణోయ్ స్పిన్నర్‌గా కొనసాగుతాడు.

భారత జట్టు అంచనా: 

వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్.

►ALSO READ | ఇషాన్ నంబర్-1, అభిషేక్ నంబర్-2.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో మనోళ్లే తోపు!

©️ VIL Media Pvt Ltd.