Reading Time: < 1 minute

Face Beauty : కంటి కింద నల్లటి చారలు వేధిస్తున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు వెంటనే మాయం..!

Caption of Image.

 చాలామందికి కంటి కింద నల్లటి చారలు బాగా ఇబ్బంది కలిగిస్తాయి.  వీటివలన ఫేస్​ బ్యూటీ దెబ్బతింటుంది. ఎన్ని మందులు వాడినా.. ఎన్ని ఫేస్​ క్రీంలు వాడినా  నల్ల చారలు తగ్గడం లేదా.. అయితే సింపుల్​ గా ఈ హోం రెమిడీస్​ ట్రై చేయండి.. ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ లేకుండా కంటి కింద నల్లచారలు మటుమాయం అవుతాయి.

నిద్రలేమి, పని ఒత్తిడి అదే పనిగా కంప్యూటర్, టీవీ, ఫోన్​ చూడడం వల్ల కళ్ల కింది నల్లటి మచ్చలు, వలయాలు ఏర్పడుతుంటాయి. వాటిని క్షణాల్లో మాయం చేయాలంటే ఈ ప్యాక్ లు తరచూ వేసుకుంటే చాలు.

  • టొమాటో రసంలో కాస్త నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్లచుట్టూ నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు క్రమంగా తగ్గుతాయి. 
  •  నిమ్మరసాన్ని తీసుకుని రోజుకు రెండుసార్లు కళ్ల కింద అప్లై చేసినా ఫలితం ఉంటుంది.
  • రోజూ రాత్రి పడుకునే ముందు కాస్త బాదం నూనె తీసుకుని కళ్ల చుట్టూ అప్లై చేసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్లకింద నల్లటి వలయాలు తగ్గుతాయి. 
  •  రోజ్ వాటర్ అప్లై చేసి మర్దనాచేసినా మంచి ఫలితం ఉంటుంది.
  • గ్రీన్ టీ బ్యాగ్స్ ను వేడినీటిలో ఐదు నిమిషాల పాటు ఉంచి వాటిని పక్కకి తీసి కొంచెం చల్లారిన తర్వాత 15 నిమిషాల పాటు కళ్లమీద పెట్టుకొని మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి కళ్ల చుట్టూ ఉన్న నలుపు పోతుంది.. అంతే కాకుండా వాపులు ఉన్నా తగ్గుతాయి.
  • కొంచెం పెరుగు తీసుకుని వేళ్లతో కళ్ల చుట్టూ మసాజ్ చేయాలి. పదినిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.
©️ VIL Media Pvt Ltd.