
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రమేశ్. ఈ మూవీలో అంత్యాక్షరి గ్యాంగ్ సభ్యుడిగా నటించి ప్రేక్షకులకు దగ్గరైన ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోంది. కొద్దికాలం క్రితం హఠాత్తుగా తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఐసీయూ (ICU)లో అత్యవసర చికిత్స అందించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న వార్త తెలియడంతో సినీ వర్గాలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే వైద్యుల నిరంతర పర్యవేక్షణ, మెరుగైన చికిత్స ఫలించడంతో ఆయన ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ నుంచి క్రమంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదెలా ఉంటే.. ప్రస్తుతం రమేశ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో గబ్బర్ సింగ్ సినిమాలో తాను నటించడం.. అంత్యాక్షరి సీన్ కు సంబంధించిన సీన్స్ టీవీలో చూస్తూ సరదాగా పాడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆయనకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ సినిమాలను చూపిస్తూ నిత్యం ఉత్సాహపరుస్తున్నట్లు తెలుస్తోంది. రమేశ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, సహ నటులు మరియు దర్శకులు స్పందించారు. ఆయన ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడమే కాకుండా, కుటుంబానికి మానసిక అండగా నిలిచి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
విలన్‌గా, కామెడీ ఆర్టిస్ట్‌గా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన రమేశ్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మళ్లీ వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించాలని సినీ శ్రేయోభిలాషులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..
గబ్బర్ సింగ్ నటుడు రమేశ్..
‘గబ్బర్‌సింగ్’ ఫేమ్ నటుడు రమేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.
ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
#Ramesh #GabbarSingh #GetWellSoon #Tollywood #Trending https://t.co/YKmvFWn0Ok
— Sanjuuuuu
(@speaks57458) September 17, 2026
ఎక్కువ మంది చదివినవి : Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..
సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



(@speaks57458)