Reading Time: 2 minutes

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ హౌస్‌లో రణరంగం.. టెంపర్ వంశీ – రోహిత్ మధ్య బిగ్ ఫైట్..!

Caption of Image.

బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ ధమాకా ‘బిగ్‌బాస్ సీజన్-10’ అప్పుడే పదో రోజుకు చేరి.. అసలైన మాస్ డ్రామాను రుచి చూపిస్తోంది! రెండో వారంలో నామినేషన్స్ మంటలు చల్లారకముందే, హౌస్‌మేట్స్ మధ్య ఫిజికల్ టాస్క్‌లతో రచ్చ మొదలైంది.  బిగ్‌బాస్ విసిరిన కొత్త ఛాలెంజ్‌లతో హౌస్‌మేట్స్ రణరంగంలో రెచ్చిపోతుండటంతో కాక పుట్టిస్తోంది.

రచ్చరచ్చ..

హౌస్‌లో మునుపెన్నడూ లేని బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్.’పవర్ ఆఫ్ ది పీపుల్’ థీమ్‌తో ఈసారి హౌస్ కెప్టెన్‌ను ఎన్నుకునే పూచీని నేరుగా ప్రేక్షకులకు అప్పగించారు. ఈ కెప్టెన్సీ బెలూన్ రేసులో త్రిగుణ్, దేబ్‌జానీ, అమన్, షాలిని, ముకేష్, రోహిత్, ఝాన్సీ, రామ్ ప్రసాద్‌ తీవ్రంగా పోటీపడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో త్రిగుణ్, రోహిత్, రామ్ ప్రసాద్, దేబ్‌జానీ, షాలిని, ముకేష్ వరుసగా ఎలిమినేట్ కాగా… అంతిమ పోరుకి ఝాన్సీ, అమన్ క్వాలిఫై అయ్యారు.  ఫైనల్ రౌండ్‌లో ఫైనల్ విజేత ఎవరనేది తేలనుంది.

రోహిత్ వర్సెస్ వంశీ..

మరో వైపు ఈ టాస్క్ లో రోహిత్,  టెంపర్ వంశీ మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఒకరిపై ఒకరు దూసుకునే వరకు వెళ్లింది.  టాస్క్ ఆడుతున్న సమయంలో రూల్స్ బ్రేక్ చేస్తున్నావు.  ఫౌల్ గేమ్ ఆడుతున్నావు అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో అరిచుకున్నారు.. ఆట మధ్యలో మొదలైన వాగ్వాదం కాస్తా పాత కక్షలను, గత గొడవలను బయటకు తీసేంత తీవ్రంగా మారింది. 

 

బిగ్ సర్‌ప్రైజ్ ..

హౌస్‌లో మరొక పెద్ద సర్‌ప్రైజ్ ఏంటంటే… చైత్ర రాయ్ లేదా ఆర్‌జే చరణ్‌లలో ఒకరు హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తారని బిగ్‌బాస్ ప్రకటించారు. వీరి భాగ్యాన్ని ప్రేక్షకుల ఓటింగే డిసైడ్ చేయనుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం ఆర్‌జే చరణ్‌కు ఓటింగ్ భారీగా ఊపందుకోవడంతో ఆయన మళ్లీ అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 

►ALSO READ | ‘కేజీఎఫ్’ నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రధాని మోదీ ప్రశంసలు!

ఈ క్రేజీ డ్రామా, అరుపులు మధ్య  ఎవరి కెప్టెన్సీ ముచ్చట నెరవేరుతుంది? హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చి రచ్చ లేపేది ఎవరు? అని తెలియాలంటే ఇవాల్టి హై-వోల్టేజ్ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే!
 

©️ VIL Media Pvt Ltd.