
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మమితా బైజు పేరు మారుమోగిపోతోంది. అతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ, ఏడాది తిరగకుండానే ఏకంగా రూ. 1000 కోట్ల బాక్సాఫీస్ క్లబ్‌లో చేరి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా, సాధించకపోయినా ప్రతీ చిత్రంలోనూ మమిత క్యారెక్టర్ ప్రత్యేకంగా హైలైట్ కావడం విశేషం.
ఇటీవల విడుదలైన చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లను పరిశీలిస్తే విజయ్ ‘జన నాయగన్’ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చి రూ. 300 కోట్లు రాబట్టింది. అలాగే ఆమె నటించిన ‘బెత్లహోం కుటుంబ యూనిట్’ భారీ విజయం సాధించింది. ఈ సినిమా మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మమిత కెరీర్ ని మరొక మెట్టు ఎక్కించింది. ఇక మరొకవైపు సూర్య హీరోగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 260 కోట్లను కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. అలానే గతేడాది ప్రదీప్ రంగనాథ్ తో చేసిన ‘డ్యూడ్’ సినిమాతో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కర’ చిత్రంరూ. 55 కోట్లు రాబట్టింది.
బాక్సాఫీస్ ఫలితాల పరంగా చూస్తే ‘కర’, ‘జన నాయగన్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక ఫ్లాప్‌గా నిలిచాయి. మరోవైపు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘బెత్లహోం కుటుంబ యూనిట్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే, ఫలితంతో సంబంధం లేకుండా ఈ అన్ని సినిమాల్లోనూ మమితా బైజు నటన, ఆమె క్యారెక్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ఆయా సినిమాలకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.