
ప్రస్తుతం లోకంలో ఎక్కువశాతం మంది డబ్బు .. సంపదను కూడబెట్టడం గురించి ఆలోచిస్తుంటారు. ఐశ్వర్యం ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చని అనుకుంటున్నారు. కాని ఆధ్యాత్మిక వేత్తలు..పండితులు తెలిపిన వివరాలు.. నిజమైన సంపద అంటే శాంతి, ప్రేమ, సంతోషం, గౌరవం అని చెబుతున్నారు.
మనం పేదవాళ్లలాగే ఉంటాం! ఎందుకంటే మన ఆలోచనలు, మన పనులు అలాగే ఉంటాయి. ఇక్కడ అసలు పేదరికం అంటే కూడు, గుడ్డ, గూడు లేకపోవడం కాదు. ఎప్పుడైతే మనం శాంతి, ప్రేమ, సంతోషం, గౌరవం లాంటి విలువల పట్ల పూర్ ఉంటామో.. అప్పుడు స్వార్థపరులుగా, అత్యాశపరులుగా మారిపోతాం. దీని వల్ల మన దగ్గర ఉన్నది ఇతరులతో షేర్ చేసుకో వడానికి బదులు… ఇతరుల నుంచి లాక్కోవ డం, డిమాండ్ చేయడం మొదలుపెడతాం. ఇది ‘పూర్’గా మార్చేస్తుంది!
ఎందుకంటే, కర్మ నియమం ఇలాగే ఉంటుంది. కర్మ విత్తనం మనం విత్తినప్పుడు దాని తాలూకు ప్రతిఫలం కచ్చితంగా పొందుతాం. అలా కాకుండా మామిడి విత్తనాల లాంటి మంచి కర్మలను చేపడితే.. మామిడి పండ్ల లాంటి పండ్లు ప్రతిఫలంగా దక్కుతాయి. మరి చెడు కర్మ అంటే ఏంటి? అది ఎలా మనల్ని ‘పూర్’గా మారుస్తుంది? అంటే, మన దగ్గర అవసరానికి మించి ఉన్నా… ఇతరులకు దాన్ని పంచలేకపోతే అదే నిజమైన పేదరికం!
పేదరికానికి సంబంధించిన వేరు ఎక్కడఉంటుంది? అంటే, మనం వేస్ట్ చేస్తున్న రిసోర్సెస్ లో ఉంది. అన్నిటికంటే విలువైన రిసోర్సెస్.. మన ఆలోచనలు! మనలో ఎలాంటి ఆలోచనలు ఉంటే.. అలాంటి క్యారెక్టరే డెవలప్ అవుతుంది. క్యారెక్టర్ ను మించిన విలువైన సంపద ఈ లోకంలో ఏముంది?
మంచి ఆలోచనలే నిజమైనసంపద! అందుకే మంచి విషయాల మీద టైమ్ ను , ఎనర్జీని, స్కిల్స్ ను ఇన్వెస్ట్ చేయాలి. స్వార్థం, అత్యాశ, అహంకారం, ఎటాచ్ మెంట్ లాంటి వాటిని మనసులో నుంచి తొల గించుకోగలిగితే.. ఈ పేదరికాన్ని ఈజీగా తుడిచిపెట్టొచ్చని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.