
- వితంతువుల నుంచి 30,326, దివ్యాంగులవి 7,972
- ఒంటరి మహిళల నుంచి 6,050 దరఖాస్తులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15తో గడువు ముగియగా.. 44,503 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా 30,326 వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకోగా.. 7,972 దివ్యాంగులు, 6,050 ఒంటరి మహిళలు ,108 మంది చేనేత కార్మికులు, 47 మంది కల్లుగీత కార్మికులు ఉన్నారు.
ఈ నెల 25వ తేదీలోగా అర్హత పరిశీలన, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. కాగా, ఇప్పటికే జిల్లాలో వివిధ కేటగిరీల కింద 2,75,383 మంది పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో1,11,903 మంది వితంతువులు, 1,10,609 మంది వృద్ధులు, 30,990 మంది దివ్యాంగులు, ఒంటరి మహిళలు11,286 మంది, చేనేత కార్మికులు 8 మంది ఉన్నారు. కల్లుగీత కార్మికుల కేటగిరీలో లబ్ధిదారులు లేరు.