
న్యాచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ సినిమా ది ప్యారడైజ్ సెన్సార్ పూర్తైంది. దీనికి సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ బజ్ వచ్చింది. యాక్షన్ సినిమా కదా ఎలా ఉంటుందో, బూతులు గానీ ఎక్కువగా ఉంటాయేమో అని లోపలికి వెళ్లిన వాళ్లకు శ్రీకాంత్ ఓదెల చూపించిన తల్లీ కొడుకుల ఎమోషనల్ సీన్స్, బలమైన ఎపిసోడ్స్, వాటి వెనక ఎమోషన్ చూసి షాక్ అయ్యారని తెలుస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులకు చాలా మంచి బజ్ వినిపిస్తుంది.. ఫస్టాఫ్‌లో వచ్చే జైల్ ఫైట్ సీన్, అలాగే ఇంటర్వెల్ సీన్ బాగా వర్కవుట్ అయ్యాయని తెలుస్తుంది.. సెకండాఫ్‌లో ఎమోషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసారు శ్రీకాంత్.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉన్నా.. శ్రీకాంత్ ఓదెల చెప్పిన దానికి కన్విన్స్ అయి చాలా తక్కువ కట్స్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. నాని కూడా స్టన్నింగ్ మేకోవర్‌తో షాక్ ఇచ్చారు. అనిరుధ్ మ్యూజిక్ కూడా సినిమాకు మేజర్ హైలైట్ అంటున్నారు. చాలా వరకు యాక్షన్ సీన్స్‌లో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా రేంజ్ పెంచిందనే టాక్ వినిపిస్తుంది.. చాలా తక్కువ కట్స్‌తోనే 2 గంటల 49 నిమిషాల నిడివితో సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానుంది. మొత్తానికి సెన్సార్ బోర్డ్ నుంచి మంచి రివ్యూనే అందుకుంది.
. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ది ప్యారడైజ్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. అలాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు కిల్ సినిమా ఫేమ్ రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషించనున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ‘ఆయా షేర్’, యేషనాగుల కట్టమీద పాటలకు యూట్యూబ్ లో రికార్డ్స్ వ్యూస్ వచ్చాయి.
ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్లలో నాని, కయాదు లోహర్..
Natural Star @NameisNani, @TheRaghav_Juyal & @sonalikulkarni talk with @impradeepmachi
#TheParadise Gang tells us the stories beyond the screen
Full interaction out tomorrow!#TheParadise GRAND RELEASE WORLDWIDE ON 24.09.26. pic.twitter.com/ovkyLBXzTs
— THE PARADISE (@TheParadiseOffl) September 16, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

