Reading Time: 2 minutes
Samsung Galaxy A18 4g Launched With Super Amoled Display 50mp Triple Camera And 6 Year Updates

Samsung Galaxy A18 4G: శామ్‌సంగ్ గెలాక్సీ A సిరీస్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ శామ్‌సంగ్ గెలాక్సీ A18 4G (Samsung Galaxy A18 4G) పేరుతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, Exynos 1610 ప్రాసెసర్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

50MP ట్రిపుల్ కెమెరా & బ్యాటరీ

ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో f/1.8 అపెర్చర్‌, ఆటోఫోకస్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. LED ఫ్లాష్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక ఈ మొబైల్ లో 5000mAh బ్యాటరీని అందించారు. ఇది 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రకారం 30 నిమిషాల్లో బ్యాటరీని 50% వరకు ఛార్జ్ చేయవచ్చు.

AMOLED డిస్‌ప్లే

గాలక్సీ A18 4Gలో 6.7 అంగుళాల FHD+ Super AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌, 90Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. ఫోన్‌కు ఫ్లాట్ ఎడ్జెస్‌, రౌండెడ్ కార్నర్స్‌తో కూడిన డిజైన్ ఇచ్చారు. దుమ్ము, నీటి చిమ్ముర్ల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ కూడా ఉంది.

ప్రాసెసర్ & ఆరేళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్ట్

పనితీరు కోసం ఈ కొత్త మొబైల్ లో ఆక్టాకోర్ Exynos 1610 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ జతగా ఉన్నాయి. మైక్రోSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 1.5TB వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌ కూడా ఉంది.

సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9.0పై పనిచేస్తుంది. ఇందులో అప్‌డేట్ చేసిన Circle to Search ఫీచర్‌తో పాటు గూగుల్ జెమినీ సపోర్ట్‌ కూడా ఉంది. మెసేజింగ్‌, షెడ్యూలింగ్‌ వంటి పనులను సహజ భాషలో నిర్వహించేందుకు జెమినీని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా కంపెనీ ఈ ఫోన్‌కు ఆరు తరాల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నట్లు తెలిపింది.

ఇతర ఫీచర్లు

ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌, NFC, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.3, GPS, GLONASS, USB Type-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 196 గ్రాములు కాగా, కొలతలు 164.4×77.9×7.7mmగా ఉన్నాయి.

ధర

ప్రస్తుతం Galaxy A18 4G 4GB RAM + 128GB స్టోరేజ్ తో ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఫ్రాన్స్‌లో దీని ధర 279 యూరోలుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో సుమారు రూ.30,885గా ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రే, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.