Reading Time: < 1 minute
Appsc Group 1 Notification 2026 163 Posts Apply Online

Group 1 Notification 2026: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC)గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 163 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం.. అక్టోబర్ 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్న పోస్టులు
ఈ నోటిఫికేషన్‌లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 11, ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 14, డీఎస్పీ (సివిల్) 36, డీఎస్పీ (కమ్యూనికేషన్స్) 3, డీఈవో పోస్టులు 14 ఉన్నాయి. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, ఆర్డీవో 3, డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సర్వీసెస్ 15 పోస్టులు ఉన్నాయి. గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 12, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 2, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 35 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. అయితే, గ్రూప్-1 ఉద్యోగాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఏపీపీఎస్సీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, ఫీజు తదితర వివరాలను నోటిఫికేషన్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.