Reading Time: < 1 minute
Ap Police Recruitment 2026 2050 Si Constable Other Posts

Police Recruitment 2026: పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఏపీలో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఫోరెన్సిక్ తదితర విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2026 జాబ్ క్యాలెండర్‌లో పోలీసు, అనుబంధ విభాగాలకు సంబంధించిన పలు పోస్టులు ఉన్నాయి. పోలీసు, ఫైర్, జైళ్లు, ఫోరెన్సిక్ విభాగాల్లో 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్లు జారీ చేసింది..

మొత్తం 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 438 సబ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. సివిల్ విభాగంలో 253, ఆర్మ్‌డ్ రిజర్వ్‌లో 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 9, కమ్యూనికేషన్స్‌లో 50, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 10 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా.. 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఉంది. ఇందులో సివిల్ కానిస్టేబుల్స్ 542, ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ 285, ఫైర్ అండ్ ప్రిజన్స్ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. తాజా జాబ్ క్యాలెండర్ వివరాల్లో పోలీస్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులు 200గా, పోలీస్ డ్రైవర్ పోస్టులు 198గా పేర్కొన్నారు.

విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో 158 ఫైర్‌మెన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగంలో 150 పురుష వార్డర్, 21 మహిళా వార్డర్ పోస్టులు ఉన్నాయి. పోలీస్ కమ్యూనికేషన్స్ విభాగంలో 200 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 198 డ్రైవర్లు, 15 మెకానిక్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల సంఖ్యలు AP 2026 జాబ్ క్యాలెండర్‌లోనూ నమోదయ్యాయి. ఇక, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయాలజీ/సెరాలజీ విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి. అదనంగా పోలీస్ శాఖలో ఇతర సాంకేతిక పోస్టులు కూడా జాబ్ క్యాలెండర్‌లో ఉన్నాయి. ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను APSLPRB ప్రత్యేకంగా ప్రకటించనుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, పరీక్ష విధానం, దరఖాస్తు తేదీలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.