Reading Time: 2 minutes

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కోమాలో ఉన్నారా.. ఢిల్లీ నుంచి వెళ్లిన తర్వాత ఏం జరిగింది..?

Caption of Image.

చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్​ఆరోగ్యంపై సోషల్​మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. జిన్ పింగ్ బ్రెయిన్​ స్ట్రోక కు గురయ్యారని, ఆయనకు ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారని ప్రచారం సాగుతోంది. చైనాకు చెందిన నిషేధిత పార్టీ నేత చేసిన X పోస్ట్​ఈ చర్చకు దారి తీసింది. ‘‘జిన్​పింగ్​ బ్రిక్స్ సదస్సులో స్పృహ కోల్పోయారు, ప్రత్యేక విమానంలో చైనాకు వచ్చారు, ఆయను  ఎమర్జెన్సీ చికిత్సకు డాక్టర్లు తరలించారని ,తన ఆరోగ్య పరిస్థితిపై భారత్​కు తెలిసిపోతుందని , ఆయన చికిత్సను నిరాకరించారని వాంజున్​తన పోస్టులో ఆరోపించడంతో పోస్టులో రాయడంతో జిన్​ పింగ్​ ఆరోగ్యంపై  ఊహాగానాలు మొదలయ్యాయి. 

ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు జరుగుతున్న సమయంలో  చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పృహ కోల్పోయారని, ఆ తర్వాత తీవ్రమైన ఇస్కీమిక్ స్ట్రోక్‌కు గురయ్యారని పోస్టులో రాశారు. జిన్​ పింగ్​ ను అత్యవసర చికిత్స కోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్ హాస్పిటల్ (సాధారణంగా 301 హాస్పిటల్ అని పిలుస్తారు)లో షీని బీజింగ్‌కు తిరిగి తరలించారని వాంజున్ పోస్టు లో చెప్పారు. దీంతో జిన్​ పింగ్​ ఆరోగ్యంపై ఊహాగానాలు చెలరేగాయి . వాంజున్ చైనాలో నిషేధించబడిన చైనా డెమోక్రసీ పార్టీ (CDP)కి చైర్మన్. వాంజున్​ అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. జిన్​పింగ్​ అనారోగ్యంపై వస్తున్న వార్తలు నిజం కాదని చైనా అధికారిక న్యూస్​ వెబ్​ సైట్  gov.cn రాసింది.  న్యూఢిల్లీ నుంచి బీజింగ్ వచ్చిన తర్వాత  జిన్​పింగ్​ కు  ఎటువంటి ఆనారోగ్యం లేదని తెలిపింది.18 బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొని  చైనా మంత్రులు, అధికారులతో కలిసి ఆరోగ్యంగా  తిరిగి వచ్చారని gov.cn  కథనాలు చెబుతున్నాయి. 

బ్రిక్స్ విందుకు జిన్​పింగ్  గైర్హాజరుపై అనేక ప్రశ్నలు.. 

18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం షీ సెప్టెంబర్ 12న న్యూఢిల్లీకి వచ్చారు.  ఏడేళ్లలో  భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి.ఈ సమావేశాల్లోపలు కీలక ఒప్పందాలు, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే ఆ తర్వాత భారత్ మండపంలో మోదీ ఏర్పాటు చేసిన విందులో పాల్గొనలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , పలువురు ఇతర బ్రిక్స్ నేతలు ఈ విందుకు హాజరు కాగా, షీ గైర్హాజరులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ బీజింగ్ తరపున హాజరయ్యారు. తీరిక లేకుండా గడిపిన రోజంతా అలసిపోయిన షీ, విశ్రాంతి తీసుకోవడానికి తన హోటల్‌కు తిరిగి వెళ్లారని రిపోర్టులు చెబుతున్నాయి .అయితే ఆయన గైర్హాజరుకు అధికారిక వివరణ ఏదీ ఇప్పటివరకు  వెలువడలేదు.

జిన్​పింగ్​ అనారోగ్యం..ఆసుపత్రిలో చేరికపై వాదనలు

చైనా అధ్యక్షుడు బ్రిక్స్​ సమావేశాల్లో అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించడంతో  ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి, ఆయన క్షేమంగా ఉన్నారా అని అడిగిన సందర్భం.. జిన్ పింగ్​ ఆరోగ్యంపై ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. వీడియో ఫుటేజీలో మోదీ, షీ ట్రాన్స్​ లేటర్​ వైపు తిరిగి, “ఫర్వాలేదా?” అని అడగడం కనిపించింది. ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించడానికి ముందు చైనా అధ్యక్షుడు స్పందించినట్లు కనిపించింది. షీకి అంత అసౌకర్యం కలగడానికి కారణం ఏమిటో స్పష్టంగా తెలియలేదు. అది మైక్‌లో ఏదైనా సమస్య వల్ల గానీ ,ఆయన ప్రసంగ అనువాదం వల్ల గానీ అయి ఉండవచ్చని భావించారు.

జిన్​పింగ్​ బ్రిక్స్ సదస్సులో స్పృహ కోల్పోయారు.. ప్రత్యేక విమానంలో చైనాకు వచ్చారు, ఆయను  ఎమర్జెన్సీ చికిత్సకు డాక్టర్లు తరలించారని ,తన ఆరోగ్య పరిస్థితిపై భారత్​కు తెలిసిపోతుందని , ఆయన చికిత్సను నిరాకరించారని తన పోస్టులో వాంజున్​ ఆరోపించారు.   ఈవాదన వాస్తవాలకు విరుద్దంగా ఉంది. 

నివేదికల ప్రకారం, షీకి తిరిగి స్వాగతం పలకడానికి ఎలాంటి ఆర్భాటమైన వేడుకలు నిర్వహించడం లేదు. ఈసారి కూడా అదే చేశారని చైనా అధికారిక మీడియా ఓ ప్రకటనలను జారీ చేస్తూ జిన్ పింగ్ ఆరోగ్యంపై ప్రచారాలను కొట్టిపారేసింది.  

©️ VIL Media Pvt Ltd.