
The Paradise: నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద మరో భారీ విధ్వంసానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ (#TheParadise) థియేటర్లలోకి వచ్చే సమయం దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరును చిత్ర యూనిట్ పీక్స్‌కు తీసుకెళ్లింది. తాజాగా మూవీ టీమ్ ‘జడల్ జమానా షురూ’ అంటూ భారీ ప్రీ-రిలీజ్ టూర్‌ను అధికారికంగా ప్రకటించింది. విడుదలకు కేవలం వారం రోజుల ముందే నాని స్వయంగా రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్లతో హోరెత్తించనున్నట్లు వెల్లడించింది.
సెప్టెంబర్ 17 నుంచి స్టార్ట్ కానున్న ఈ ప్రీ-రిలీజ్ టూర్ సౌత్ ఇండియాలోని కీలక నగరాలను చుట్టేయనుంది. చిత్ర బృందం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 17 నుంచి నాని, చిత్ర బృందంతో కలిసి ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించనున్నారు. ముందుగా చెన్నైలో అభిమానులను, స్థానిక మీడియాను కలిసి చిత్ర విశేషాలను పంచుకోనున్నారు. తర్వాత 18 వ తేదీన బెంగళూరులో నిర్వహించే ప్రమోషన్స్‌లో పాల్గొంటారు. 19వ తేదీ కొచ్చిలో కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 21న హైదరాబాద్ వేదికగా గ్రాండ్‌గా జరగనున్న భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో ఈ టూర్‌ను అట్టహాసంగా ముగించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ నేపథ్యంలో నాలుగు ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ నాని నేరుగా ప్రేక్షకులను కలుసుకోనుండటంతో సినిమాపై బజ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసి, సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని అత్యంత ఘనంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘జడల్ జమానా’ మొదలైందంటూ చిత్ర యూనిట్ ఇచ్చిన పిలుపుతో నాని అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టేశారు. బాక్సాఫీస్ వద్ద ఈసారి నేచురల్ స్టార్ ఎలాంటి సరికొత్త రికార్డులు సృష్టిస్తారో చూడాలి.
JADAL ZAMANA SHURU with #TheParadise tour
Meet Natural Star @NameisNani & team in Chennai, Bengaluru, Kochi & Hyderabad starting tomorrow (17th September)
#TheParadise GRAND RELEASE WORLDWIDE ON 24.09.26.#JadalZamanaFromSep24 pic.twitter.com/zcOmcSRPCy
— THE PARADISE (@TheParadiseOffl) September 16, 2026

