Reading Time: < 1 minute

అసెంబ్లీ దగ్గర ఓవరాక్షన్ ఇష్యూ: రెండోసారి విచారణకు కేటీఆర్ పీఏ, పీఆర్వో

Caption of Image.

హైదరాబాద్: అసెంబ్లీ దగ్గర ఓవరాక్షన్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ రెండోసారి విచారణకు హాజరయ్యారు. లాయర్లతో కలిసి గురువారం (సెప్టెంబర్ 17) సైఫాబాద్ పోలీస్ స్టేషన్‎కు హాజరయ్యారు. 

ఈ కేసులో సెప్టెంబర్ 14న సైఫాబాద్ పోలీసులు ఇప్పటికే ఒకసారి వీరిని  విచారించిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పీఎస్ దగ్గర హైడ్రామా నడిచింది. కేటీఆర్ పీఏ, పీఆర్వోపై పీఎస్‎లో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని ఆరోపిస్తూ స్టేషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఆరోపణలను పోలీసులు ఖండించారు. 

పోలీస్ స్టేషన్‎లో కేటీఆర్ పీఏ, పీఆర్వోపై ఎలాంటి దాడి జరగలేదని క్లారిటీ ఇచ్చారు. డీజే పర్మిషన్ కోసం వచ్చిన స్థానిక యువకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా విచారణ సందర్భంగా ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

►ALSO READ | చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం అక్రమం.. నోయల్ టాటా సంచలన కామెంట్స్!

©️ VIL Media Pvt Ltd.