Reading Time: < 1 minute

UPI ఛార్జీలపై వెనక్కి తగ్గేదే లేదని మరోమారు తేల్చి చెప్పిన కేంద్రం

Caption of Image.

ఢిల్లీ: ప్రతిపాదిత MDRను ఉపసంహరించుకోవడాన్ని కేంద్రం పరిశీలిస్తోందా అని మీడియా అడిగిన ప్రశ్నలకు.. పునరాలోచన చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వ ఉన్నత అధికారి స్పష్టం చేశారు. కొత్త యూపీఐ విధానం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ఒత్తిడికి లొంగిపోయారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. 

విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ యూపీఐ ఛార్జీలపై వెనక్కి తగ్గేదే లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. విదేశీ ఒత్తిడి కారణంగా ఈ మార్పులు జరిగాయన్న ఆరోపణను కేంద్రం కొట్టిపారేసింది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.

డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను నిర్వహించే బ్యాంకులు, నెట్‌‌వర్క్ సంస్థలకు వ్యాపారులు చెల్లించే రుసుమును ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’(ఎండీఆర్‌‌‌‌) అంటారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2020 నుంచి యూపీఐకి ఎండీఆర్ మినహాయింపు ఇచ్చారు.

►ALSO READ | జియో రీఛార్జ్ ఆఫర్.. 349 లేదా 399తో రీఛార్జ్ చేసుకుంటే..

అయితే, ప్రతినెలా బిలియన్ల కొద్దీ లావాదేవీలు జరుగుతుండటంతో సెక్యూరిటీ, సర్వర్ల నిర్వహణ భారంగా మారిందని బ్యాంకులు, పేమెంట్ సంస్థలు వాదిస్తున్నాయి. దీంతో పెద్దమొత్తంలో జరిగే లావాదేవీలపై పరిమితంగా ఎండీఆర్ విధించే అంశంపై ఎన్‌‌పీసీఐ కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఒక వినియోగదారుడు దుకాణంలో రూ. 2 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లిస్తే, ఆ వ్యాపారి నుంచి బ్యాంకులు 0.4 శాతం రుసుమును వసూలు చేస్తాయి. అయితే ఈ చార్జీకి గరిష్ట పరిమితిని రూ. 300 గా నిర్ణయించారు.

ఉదాహరణకు.. రూ. 3వేల చెల్లింపుపై వ్యాపారి రూ. 12, రూ. 50వేల చెల్లింపుపై రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. రూ. లక్ష కొనుగోలు జరిగినా కూడా గరిష్ట పరిమితి ప్రకారం రూ.300 మాత్రమే కట్ అవుతుంది.

©️ VIL Media Pvt Ltd.