Reading Time: 2 minutes

Samantha: ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ వెల్లడించిన టాలీవుడ్ క్వీన్.. ఆ డ్రీమ్ మెనూపై మనసు పారేసుకున్న సమంత!

Caption of Image.

టాలీవుడ్ క్వీన్ సమంతా రూత్ ప్రభు.. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. దర్శక నిర్మాత రాజ్ నిడిమోరును డిసెంబర్ 2025లో కోయంబత్తూర్ ఈషా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకుంది. త్వరలోనే తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవల అత్యంత సన్నిహితుల సమక్షంలో శ్రీవిద్య ఉపాసకుడి ఆధ్వర్యంలో శ్రీ చక్ర యంత్ర పూజలతో సాంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకలను జరుపుకుని మెరిసిపోయింది..  

 అయితే, ఈ క్యూట్ ప్రెగ్నెన్సీ జర్నీలో సామ్‌కి వచ్చిన క్రేజీ ‘క్రేవింగ్స్’ ను ఓపెన్‌గా చెప్పేసింది. త్వరలో ‘సోనీ విజా’ (Sony Vhiza), ‘సోనీ లివ్’లో ప్రసారం కానున్న ‘సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళ’ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తుంది.   బ్లూ కలర్ సిల్క్ సూట్‌లో ఎంతో అందంగా మెరిసిపోతూ తన డ్రీమ్ మెనూను పంచుకుంది.

సామ్ మాతృత్వపు క్రేజీ మెనూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ గా వేడి వేడి మెత్తటి ఇడ్లీ. మధ్యాహ్నం లంచ్ కి హాయిగా ఉండే కమ్మని పెరుగన్నం. రాత్రి డిన్నర్ క్రిస్పీగా ఉండే వేడి వేడి దోశ జీవితాంతం తినమన్నా ఇవే తింటాను, బహుశా ఇవి నా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ కావచ్చేమో.. తర్వాత మారినా మారొచ్చు అంటూ స్మైల్ తో చెప్పుకొచ్చింది.

►ALSO READ | త్రిష స్థానంలో నేనుంటే ఆలా చేయను.. విజయ్-తో డేటింగ్ రూమర్లపై అంబిక షాకింగ్ కామెంట్స్!

ఇక ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల క్లబ్ సాధించి..సక్సెస్ మీట్‌లోనే తన ప్రెగ్నెన్సీ వార్తను ధృవీకరించింది. ఇప్పుడు చిన్న మాతృత్వ విరామం (Maternity Break) తీసుకుంది సామ్. వర్కవుట్స్, డైలీ డైరీ స్పెషల్స్, ఫిట్‌నెస్ టిప్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఈ క్యూట్ మామ్.. తనలోని సరికొత్త వర్షన్‌ను ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తోంది. ప్రెగ్నెన్సీలో కూడా ఆమె ఎనర్జీ చూస్తే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇడ్లీ-దోసే ప్రేమలో మునిగిన సమంత బేబీ బంప్‌తో మరింత క్యూట్‌గా కనిపిస్తోందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Vizha (@sony.vizha)

 

©️ VIL Media Pvt Ltd.