Reading Time: < 1 minute

గాంధీభవన్కు నర్సారెడ్డి పంచాది.. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే , గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి తూంకుంట నర్సారెడ్డి బుధవారం గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజయ్యారు. సిద్దిపేట జిల్లాలోని సొంత పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలతో ఓ వర్గం నర్సారెడ్డిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు  చేసింది.

దీంతో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై స్పందించిన నర్సారెడ్డి.. కమిటీ చైర్మన్ మల్లు రవిని గాంధీ భవన్ లో కలిసి తన వివరణను రాతపూర్వకంగా అందించారు. దీన్ని పరిశీలించిన తర్వాత.. తదుపరి చర్యలు తీసుకుంటామని మల్లు రవి చెప్పారు. 
 

©️ VIL Media Pvt Ltd.