Reading Time: < 1 minute

ఏసీబీకి కీసర సీఐ, ఎస్‌ఐ పట్టుబడటంతో స్థానికుల సంబరాలు..

Caption of Image.

అవినీతి అధికారులు బదిలీ అయినప్పుడో, సస్పెండ్ అయినప్పుడో జనం సంబరాలు జరుపుకున్న ఘటనలు ఇటీవల తరచూ కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లా కీసరలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అవినీతి ఎస్సై ఏసీబీకి పట్టుబడటంతో సంబరాలు జరుపుకున్నారు జనం. గురువారం ( సెప్టెంబర్ 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…

కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు చేపట్టిన చర్యలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పీడీఎస్ బియ్యం కేసుకు సంబంధించి రూ.5 లక్షలు లంచం తీసుకుంటున్న ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కీసర సీఐ ఆంజనేయులు పాత్రపైనా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కీసర పోలీస్ స్టేషన్ ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఏసీబీ చర్యలను స్వాగతిస్తూ జనం నినాదాలు చేసినట్లు సమాచారం.

ALSO READ : ఖమ్మం జిల్లాలో విషాదం.. కొడుకు, కూతురికి పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి..

పోలీస్ స్టేషన్ ఎదుట కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది. కాగా, లంచం వ్యవహారంపై ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.