Reading Time: < 1 minute

వైఎస్ వివేకా హత్య కేసులో CBI కోర్టు కీలక నిర్ణయం

Caption of Image.

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో CBI కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులు వేసిన డిశ్చార్జ్ పిటిషన్లను నాంపల్లి CBI కోర్టు రిటర్న్ చేసింది. నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్లు వేసిన డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయస్థానం రిటర్న్ చేసింది. BNS చట్టం ప్రకారం ఛార్జ్ షీట్ వేసిన 40 రోజుల్లోపే డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయాలని CBI కోర్టు భావించింది.

సరైన సమయంలో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయకపోవడంతో సీబీఐ కోర్టు పిటిషన్లు రిటర్న్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో ఈ కేసులో వివేకా నిందితులకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 2019, మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. తొలుత గుండెపోటుతో చనిపోయారని వార్తలు వచ్చినా ఆ తర్వాత హత్యగా తేలింది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి జరిగిన రూ.40 కోట్ల లావాదేవీలపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి నివాసంతో పాటు నిందితులు శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, సయ్యద్ మున్నా ఇండ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.

►ALSO READ | కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా… బ్యాంకు అకౌంట్లు  అన్‌ఫ్రీజ్ చేయండి

హైదరాబాద్‌లోని కోకాపేట, కడపలోని 5 ప్రాంతాలతో సహా మొత్తం 7 చోట్ల తనిఖీలు చేపట్టారు. అవినాశ్ రెడ్డి నివాసం నుంచి లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదు, 2 లాకర్ల తాళాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను గుర్తించి సీజ్ చేశారు.

2020 మార్చి నుంచి సీబీఐ ఈ కేసులో 3 చార్జ్‌షీట్లను దాఖలు చేసింది. ఈ కేసులో మరో నిందితుడైన షేక్ దస్తగిరి అప్రూవర్‌‌గా మారాడు. వివేకా హత్య కోసం శివ శంకర్ రెడ్డి రూ.40 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు, సునీల్ యాదవ్ నుంచి రూ.కోటి తీసుకున్నట్లు దస్తగిరి సీబీఐ విచారణలో అంగీకరించాడు.

©️ VIL Media Pvt Ltd.