
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రే కొడుకును హతమార్చాడు. గురువారం ( సెప్టెంబర్ 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..జగిత్యాల రురల్ మండలం ఒడ్డెర కాలనీలో జరిగింది ఈ ఘటన. కాలనీకి చెందిన రాజయ్య తన 22ఏళ్ళ కొడుకు వెంకటేష్ ను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. వెంకటేష్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు వైద్యులు.
హత్య అనంతరం నిందితుడు రాజయ్య పరారయ్యాడు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని చెబుతున్నారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు.