Reading Time: < 1 minute

Hair beauty : జుట్టు ఒత్తుగా ఉండి.. పొడి లేకుండా ఉండేందుకు ఇంటి చిట్కాలు ఇవే..!

Caption of Image.

బయట వాతావరణం చల్లగా ఉన్నా ‘చాలామంది పొడి జుట్టుతో బాధపడుతుంటారు. ఎక్కువగా తలకు నూనె పెట్టకపోవడం, వేడి వేడి నీళ్లు తలపై పోసుకోవడం, నిద్రలేమి, బలమైనవి తినక పోవడం వల్ల ఇలా జుట్టు డ్రైగా మారిపోతుంది. ఈ సమస్యను ముందే గుర్తించాలి. లేదంటే జుట్టురాలిపోవడం, బట్టతల, చుండ్రు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే.. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే హెల్దీ హెయిర్ సొంతం చేసుకోవచ్చు. ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .!

  • వారానికి ఒకసారి తలకు వెన్న పెట్టడం వల్ల జుట్టులో తేమ పెరుగుతుంది. దీనివల్ల జుట్టు పొడిగా మారకుండా ఉంటుంది.
  • ఉల్లిగడ్డ రసాన్ని తల మాడుకు బాగా పట్టించాలి. ఐదు నిమిషాలు మసాజ్ చేసి అరగంట వదిలేయాలి. ఈ ఉల్లిగడ్డ రసం జుట్టులో తేమను పెంచడమే కాకుండా జుట్టును స్ట్రాంగ్ గా మారుస్తుంది.
  •  ఫేస్ ప్యాక్ లు వేసినట్టే జుట్టుకు కూడా అప్పుడప్పుడు ప్యాక్ లు వేయాలి. ముఖ్యంగా ఫ్రూట్ హెయిర్ ప్యాక్ జుట్టుకు వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. స్ట్రాబెర్రీ పండ్లు, కొన్ని గులాబి పూల రేకులతో కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని తలకు ప్యాక్ లా వేసి అర గంటపాటు ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిగా మారకుండా ఉంటుంది.
  • రెగ్యులర్ షాంపూ చేయడం వల్ల కూడా హెయిర్ డ్రై గా మారిపోతుంది. కాబట్టి అప్పుడ ప్పుడు షాంపూ బదులు షికాకాయను ఉపయోగించాలి. వారానికి ఒకసారి పాలతో జుట్టును క్లీన్ చేసుకున్నా.. జుట్టు మెరుస్తూ ఉంటుంది.
©️ VIL Media Pvt Ltd.