Reading Time: 2 minutes

డిజిటల్ పేమెంట్స్ రియాలిటీ: పేరుకే వ్యాపారులపై UPI ఛార్జీలు.. కట్టాల్సింది మాత్రం జనమే!

Caption of Image.

ఉచిత యూపీఐ చెల్లింపులకు మోడీ సర్కార్ గుడ్ బై చెప్పేయటంతో అటు వ్యాపారులతో పాటు ఇటు సామాన్య యూపీఐ యూజర్లను కూడా భయపడుతున్నారు. కొత్తగా వ్యాపారులపై తీసుకొచ్చిన మర్చంట్ ఛార్జీలు వాస్తవానికి బిజినెస్ కమ్యూనిటీకి భారమే. ఇప్పటికే ఆదాయపుపన్ను, జీఎస్టీ చెల్లిస్తుంటే అదనంగా యూపీఐ చెల్లింపుల ఛార్జీలు కూడా మోయటం కష్టమే అంటున్నారు వ్యాపారులు. ఇప్పటికే తక్కువ మార్జిన్లు, అధిక పోటీతో బిజినెస్ నెమ్మదించిందని ఈ టైంలో మోడీ సర్కార్ మరో టైం బాంబు పేల్చిందని అంటున్నారు. 

కేంద్ర ప్రభుత్వం యూపీఐ ఛార్జీల నిర్ణయంతో వ్యాపారులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు వ్యాపారులు ఈ ఛార్జీలను భరించాలంటే తమ వ్యాపారంలో బిజినెస్ మార్జిన్లను దానికి తగినట్లుగా పెంచుకోక తప్పదని.. సో వస్తుసేవల రేట్లు పెంచే మార్గం సరైనదని భావిస్తున్నారు. దీంతో నేరుగా కస్టమర్లపై భారం పడనట్లు కనిపించనప్పటికీ వాస్తవానికి జనం జేబులపైనే పరోక్షంగా యూపీఐ పేమెంట్స్ ఛార్జీల భారం పడనుంది. 

ఇక మరో వర్గం వ్యాపారులు ఈ డిజిటల్ చెల్లింపులు వేస్ట్.. ఇవి వచ్చినప్పటి నుంచే తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. చాలా మంది తమ షాపుల వద్ద యూపీఐ చెల్లింపుల స్వీకరణను నిలిపివేసి క్యాష్ బిజినెస్ మెుదలుపెట్టేశారు. చూడటానికి ఒక హోల్ సేల్ వ్యాపారి రోజుకు రూ.50వేలు బిజినెస్ చేసినా అందులో జీఎస్టీ, టాక్సులు, షాపు అద్దెలు, కరెంటు బిల్లులు, వర్కర్ల జీతాలు అంటూ బోలెడన్ని ఖర్చులు ఉంటాయి. ఆ మిగిలిన కొద్ది మెుత్తంపై మళ్లీ యూపీఐ ఛార్జీలు అంటూ వేదించటం సరికాదని, అందుకే తాము నేరుగా క్యాష్ పేమెంట్స్ కి మారిపోతున్నాం అని వారు చెబుతున్నారు. 

ఆవిరైపోతున్న రూపాయి విలువ:
ఒకప్పుడు ఫిజికల్ కరెన్సీ వాడిన సమయంలో ఎవరైనా వ్యక్తి తన దగ్గర ఉన్న రూ.100 ఖర్చు చేసి ఏవైనా కొనుక్కుంటే సాయంత్రానికి 10 మంది చేతులు మారినా ఆ డబ్బు విలువ వంద రూపాయలుగానే ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఉదయం ఒక వ్యక్తి రూ.100 షాపులో ఖర్చు చేస్తే వ్యాపారి చేతికి వెళ్లే సరికి దాని విలువ రూ.96 అవుతుంది. అతను బిజినెస్ పేమెంట్స్ కోసం దానిని వాడితో ఆ రూ.96 విలువ ఇంకా పడిపోతుంది ఛార్జీల కారణంగా. ఇలా పది చేతులు మారేసరికి ఉదయం రూ.100 విలువ సాయంత్రానికి ఏ రూ.80 లేదా రూ.70కి పడిపోతుంది. ఇలా డబ్బు చేతులు మారటం పెరిగేకొద్ది దాని విలువ జనం చేతిలో ఆవిరైపోతుంటే.. ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఏం చేయకుండానే కాసుల వర్షం కురుస్తుంది పన్నులు, ఛార్జీల రూపంలో. 

©️ VIL Media Pvt Ltd.