
IPL 2027 Mini Auction: దుబాయ్, అబుదాబి అంటూ అరేబియా దేశాల చుట్టూ తిరిగిన ఐపీఎల్ వేలం పాట మళ్లీ ఇండియాకే తిరిగొస్తోంది. విదేశాలకు ప్రయాణాలు, అక్కడ హోటళ్లు దొరకక పడే తిప్పలు తమ వల్ల కాదని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు బీసీసీఐకి స్పష్టంగా చెప్పేశారు. మంగళవారం (సెప్టెంబర్ 15న) జరిపిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఓనర్ల బాధ అర్థం చేసుకున్న బోర్డు బాస్‌లు.. ఐపీఎల్ 2027 మినీ ఆక్షన్‌ను మన దేశంలోనే పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఆ ట్రావెల్ నరకం మాకొద్దు:
తిప్పలు తట్టుకోలేక: 2023లో కొచ్చిలో ఆక్షన్ జరిగాక, ఆ తర్వాతి ఎడిషన్ల కోసం బీసీసీఐ విదేశీ బాట పట్టింది. కానీ గతేడాది అబుదాబి వేలం సమయంలోనే టీమ్ యాజమాన్యాలకు చుక్కలు కనిపించాయి.
బోర్డుతో చర్చలు: కోట్లాది రూపాయల ఖర్చుతో పాటు భారీ సిబ్బందితో విదేశాలకు ప్రయాణించడం, ఆపరేషనల్ పనులు చక్కబెట్టుకోవడం అనవసరపు భారంగా మారిందని ఓనర్లు బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లారు. స్వదేశంలోనే అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు విదేశీల్లో వేలం ఎందుకని క్లారిటీ ఇవ్వడంతో, మూడేళ్ల విరామం తర్వాత 2027 వేలం మళ్లీ ఇండియాకి రావడం ఫిక్స్ అయింది.
ALSO READ : దూబే బైసెప్స్కి వైభవ్ ఫిదా: అన్నా.. నీలెక్క కండలు రావాలంటే ఏం చేయాలంటూ క్వశ్చన్!
బీసీసీఐకి సరికొత్త తలనొప్పి:
వేలం భారత్‌లోనే అని నిర్ణయించినప్పటికీ బీసీసీఐకి సరికొత్త సవాల్ ఎదురైంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య దేశంలో పెళ్లిళ్ల సీజన్ ఎక్కువగా ఉంటుంది. ఆక్షన్ కోసం అన్ని టీమ్స్ డెలిగేషన్లు, బీసీసీఐ అధికారుల కోసం కనీసం 100కు పైగా 5-స్టార్ హోటల్ రూమ్‌లు వరుసగా రెండు రోజులు లభించడం కాస్త కష్టమే. సరైన హోటల్ లభ్యత ఉన్న నగరాల ఆధారంగానే తుది వేదికను బీసీసీఐ అనౌన్స్ చేయనుంది. ఈ మినీ ఆక్షన్ ఎలాగో ఇండియాలోనే జరగనుండగా, వచ్చే ఏడాది జరగబోయే ఆక్షన్ (Auction)ను మాత్రం మళ్లీ విదేశాల్లోనే ప్లాన్ చేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.