Reading Time: < 1 minute
Bethlehemkudumbaunit Overseas Collections 14 08m Rampage Is Small Word

మలయాళ చిత్రసీమ బాక్సాఫీస్ వద్ద మరో సంచలనాన్ని నమోదు చేసింది. నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ చిత్రం విడుదలైన 24 రోజుల్లోనే విదేశీ మార్కెట్లలో మైండ్ బ్లాకింగ్ వసూళ్లను సాధించి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతర్జాతీయంగా ఈ చిత్రం దాదాపు $14.08 మిలియన్ల (సుమారు ₹134.6 కోట్లు) గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఓవర్సీస్ కలెక్షన్స్ ను ఓసారి పరిశీలిస్తే..  మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మళయాలం సినిమాలకు బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. దుబాయ్, కువైట్, సౌదీ పాటు అరబ్ కంట్రీస్ అన్నిటిలోను మలయాళం సినిమాలు భారీ వసూళ్లు రాబడతయి. బెత్లహేమ్ కుటుంబ యూనిట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో $7.65M వసూళ్ళు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఉత్తర అమెరికాలో $2.35M, యుకే & ఐర్లాండ్: $2.224M, ఆస్ట్రేలియా: $0.889M, జర్మనీ: $0.423M, న్యూజిలాండ్: $0.200Mతో భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా చూస్తే ఓవర్సీస్ వసూళ్లు $14.08M మన ఇండియన్ కరెన్సీలో రూ.  134.6 Cr కొల్లగొట్టింది. ఈ వసూళ్లతో మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓవర్సీస్ గ్రాస్ సాధించిన చిత్రాల్లో ‘ఎంపురాన్’ ($16.9M) తర్వాతి స్థానంలో నిలిచి 2వ అతిపెద్ద రికార్డును కైవసం చేసుకుంది. కేరళలో  బెత్లహేమ్ కుటుంబ యూనిట్ రూ. 138.41 కోట్లు, భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో రూ. 32.80 కోట్లు వసూలు చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 305.80 కోట్ల గ్రాస్ సాధించి మోలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైమ్ నంబర్ 1 గ్రాసర్‌గా కొత్త అధ్యాయాన్ని లిఖించింది.