Reading Time: < 1 minute

‘పవర్ హౌస్’గా చియాన్ విక్రమ్.. ‘అపరిచితుడు’ రేంజ్ వైలెన్స్ విత్ కామెడీ!

Caption of Image.

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అంటేనే డిఫరెంట్ క్యారెక్టర్స్‌కు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు మరోసారి తనలోని రెండు షేడ్స్‌తో ప్రేక్షకులను షాక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. విక్రమ్ కెరీర్‌లో 63వ చిత్రంగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘పవర్ హౌస్’ ( Power House ) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్ . 

ఈ ప్రోమో చూస్తే.. సినిమా అసలు కథ ఏంటి? విక్రమ్ క్యారెక్టర్‌లో దాగి ఉన్న రహస్యం ఏంటి? అనే ఆసక్తి పెరగడం ఖాయం. తొలుత ఓ సాధారణ వెడ్డింగ్ క్యాటరర్‌గా విక్రమ్ కనిపిస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ.. పెళ్లిళ్లను సక్సెస్ చేయడంలో తనకు ‘100 శాతం గ్యారంటీ’ అంటూ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. ఊర్వశి, VTV గణేష్‌ల కామెడీ సన్నివేశాలు సినిమాకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ టచ్ ఇస్తున్నాయి.

కానీ అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది.. స్టోరేజ్ రూమ్‌లోకి వెళ్లిన విక్రమ్‌కు ఇద్దరు తీవ్రంగా గాయపడిన వ్యక్తులు కనిపిస్తారు. వారి పక్కనే రక్తపు మరకలను ప్రశాంతంగా శుభ్రం చేస్తున్న విక్రమ్‌ను చూసి ఒక్కసారిగా ప్రోమో టోన్ మారిపోతుంది. అతనిలోని ఈ డార్క్ షేడ్‌ను ‘అన్నియన్ సైడ్’గా ప్రస్తావించడం మరింత క్యూరియాసిటీ పెంచింది. ఫ్యామిలీ కామెడీ వెనుక దాగిన ఆ రక్తపాత రహస్యం ఏంటి? విక్రమ్ నిజంగా ఎవరు? అనే ప్రశ్నలతో ఈ ‘పవర్ హౌస్’పై ఇప్పుడే హైప్ మొదలైంది.

►ALSO READ | OTT Thriller: థియేటర్లలో మిక్స్‌డ్ టాక్.. OTTలోకి సుమంత్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

‘ఇరు ముగన్’ తర్వాత దర్శకుడు ఆనంద్ శంకర్‌తో విక్రమ్ చేస్తున్న రెండో సినిమా ఇది. రియా షిబు, షమ్మీ తిలకన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం, ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ నిర్మిస్తున్న ఈ మూవీ 2027లో థియేటర్లలోకి రానుంది. 

 

©️ VIL Media Pvt Ltd.