Reading Time: 2 minutes

20 ఏళ్ల ‘ప్రేమ – పోరాటం’.. పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న కోలీవుడ్ క్యూట్ కపుల్!

Caption of Image.

వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచే మోస్ట్ పాపులర్ అండ్ లవబుల్ కపుల్ సూర్య – జ్యోతిక. వీరిద్దరి కెమిస్ట్రీకి, బాండింగ్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ సెట్స్‌లో మొదలైన వీరి పరిచయం, ఆ తర్వాత ‘కాక్క కాక్క’, ‘సిల్లును ఒరు కాదల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో గాఢమైన ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2006, సెప్టెంబర్ 11న ఈ లవ్ బర్డ్స్ గ్రాండ్‌గా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

ఇప్పుడు సరిగ్గా 20 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ డివైన్ కపుల్.. అభిమానులకు ఒక అద్భుతమైన స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. తమ ప్రేమను మరింత చిరస్మరణీయం చేసుకుంటూ, పిల్లలు దియా, దేవ్, తమ్ముడు కార్తీతో పాటు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో రెండోసారి మళ్లీ పెళ్లి  చేసుకున్నారు.

ఈ స్పెషల్ ఈవెంట్‌లో జ్యోతిక దేవకన్యలా వైట్ గౌన్‌లో మెరిసిపోగా.. సూర్య క్లాసిక్ వైట్ సూట్, బ్లాక్ ట్రౌజర్స్‌లో రాకింగ్ లుక్‌లో కనికట్టు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ జ్యోతిక రాసుకొచ్చిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది.

20 ఏళ్ల ప్రేమ , పోరాటం.. ‘ది సీక్వెల్’ఇది పర్ఫెక్ట్ మ్యారేజ్ సెలబ్రేషన్ కాదు.. మా మధ్య ఉన్న అపరిపూర్ణతలు, సర్దుబాట్లు, త్యాగాలు, ఒకరిపై ఒకరికి ఉన్న నిస్వార్థమైన ప్రేమకు వేడుక. ఇప్పటికీ నేను సూర్యతో గొడవపడి, ఆ తర్వాత మరింత దగ్గరయ్యే ‘ఇంపర్ఫెక్ట్’ భార్యగానే ఉంటానని ప్రామిస్ చేస్తున్నా అంటూ జ్యోతిక వేసిన ఎమోషనల్ అండ్ క్యూట్ వోవ్స్ ప్రతీ ఒక్కరి హృదయాలను టచ్ చేస్తున్నాయి.

పెళ్లి తర్వాత కొన్నాళ్లు నటనకు దూరంగా ఉండి.. ’36 వయధినిలే’తో రీ-ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ దూసుకుపోతున్న జ్యోతికకు, సూర్య ఎల్లప్పుడూ వెన్నంటే నిలిచారు. 20 ఏళ్ల మైలురాయి దాటినా, ఇప్పటికీ అంతే ఫ్రెష్‌గా, ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్‌గా, గాసిప్ పార్ట్‌నర్స్‌గా జీవిస్తున్న ఈ రియల్ లైఫ్ జోడీపై సోషల్ మీడియాలో టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలతో పాటు అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.