Reading Time: < 1 minute
7 ఫోర్లు, 3 సిక్స్‌లతో తొలి సెంచరీ.. 22 ఏళ్ల అరుదైన జాబితాలోకి నయా సెన్సేషన్..!

Matt Renshaw Maiden Century: జింబాబ్వేతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాట్ రెన్‌షా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన ఆయన, ఆసీస్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే అరుదైన ఫీట్‌ను అందుకోవడం గమనార్హం. జింబాబ్వేపై ఒక ఆస్ట్రేలియా బ్యాటర్ వన్డే శతకం సాధించి దాదాపు 22 సంవత్సరాలు గడిచింది. గతంలో 2004 సంవత్సరంలో హరారే (Harare) వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ (Michael Clarke) నాటౌట్‌గా 105 పరుగులు చేశాడు. ఆ తరువాత ఇన్నాళ్లకు మళ్లీ అదే ప్రత్యర్థిపై మూడంకెల స్కోరును అందుకున్న ఆసీస్ క్రికెటర్‌గా రెన్‌షా సరికొత్త చరిత్ర లిఖించాడు.

6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రెన్‌షా, 86 బంతుల్లోనే తన సెంచరీ మార్కును చేరుకుని జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడం విశేషం. కీలక సమయాల్లో భాగస్వామ్యాలు నిర్మిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

చివర్లో నాథన్ ఎల్లిస్ (Nathan Ellis) లాంటి లోయర్ ఆర్డర్ ఆటగాళ్లతో కలిసి రెన్‌షా ఇన్నింగ్స్‌ను వేగవంతం చేయడంతో ప్రత్యర్థి ముందు ఆసీస్ బలమైన లక్ష్యాన్ని ఉంచగలిగింది. సుదీర్ఘ విరామం అనంతరం దక్కిన ఈ సెంచరీతో రెన్‌షా తన వన్డే కెరీర్‌లో అత్యంత కీలకమైన మైలురాయిని అధిగమించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..