Reading Time: < 1 minute

నా ఫ్లెక్సీలను చింపగలరేమో కానీ.. నా మనోబలాన్ని చింపలేరు: మల్లారెడ్డి కోడలు ప్రీతి

Caption of Image.

కుత్బుల్లాపూర్ లో మల్లారెడ్డి కోడలి ఫ్లెక్సీల చించివేత కలకలం రేపింది. గురువారం ( సెప్టెంబర్ 17 ) డాక్టర్ ప్రీతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేశారు కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు. చింతల్, సుచిత్ర, జీడిమెట్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పుట్టినరోజు కటౌట్లు, ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో తన ఫ్లెక్సీల చింపివేయడంపై స్పందించిన ప్రీతిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన ఫ్లెక్సీలను చింపగలరేమో కానీ.. తన మనోబలాన్ని చింపలేరని అన్నారు.

ఇది పార్టీకి సంబంధించిన అంశం కాదని.. కేవలం తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రమేనని అన్నారు ప్రీతి రెడ్డి. విషయం తెలీకుండా ఫ్లెక్సీలు చించివేస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు ప్రీతి రెడ్డి.

అయితే.. ప్రీతి రెడ్డి ఫ్లెక్సీలలో కేసీఆర్, కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫోటోలు లేకపోవడంపై బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రోటోకాల్ పాటించకుండా, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేల ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టడంపై  మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు.

 

©️ VIL Media Pvt Ltd.