Reading Time: < 1 minute

షార్జాతో ప్రభుత్వంతో..తెలుగు కంపెనీల ఒప్పందం

Caption of Image.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వ్యాపారవేత్తలతో, సాంకేతిక నిపుణులతో షార్జా ప్రభుత్వం చేతులు కలిపింది. తెలుగు సంస్థలు యూఏఈ , గల్ఫ్​లో తమ వ్యాపారాలను విస్తరించడానికి వీలుగా ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి, షార్జా ప్రభుత్వానికి చెందిన ఎస్సార్‌‌‌‌టీఐపీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 

షార్జాలోని ఎస్సార్‌‌‌‌టీఐపీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ముఖ్య వ్యూహాధికారి డాక్టర్ ఫరీద్ మహ్మూద్ అబ్దల్లా అల్ అమీరీ, మండలి చైర్మన్ సందీప్ మక్తాల ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 

ఈ భాగస్వామ్యంతో కొత్త సాంకేతికతల పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నూతన ఉత్పత్తుల అభివృద్ధి వంటి రంగాలలో ఇరు వర్గాలు కలిసి పనిచేయనున్నాయి.  తెలుగు ప్రతిభను షార్జాలోని నూతన అవకాశాలతో అనుసంధానించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.