బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. భారత్‌పై అమెరికా సుంకాలు, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాల క్రమంలో పసిడి ధరలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. బుధవారం అర్థరాత్రి 12 గంటలకు ఫెడ్ నుంచి ప్రకటన రానున్న క్రమంలో గోల్డ్ రేట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు భారీగా పతనమయ్యే అవకాశముంది. ఈ ప్రకటన క్రమంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,440కు లభిస్తోండగా.. బుధవారం ఒక్కరోజే రూ.270 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,650 వద్ద కొనసాగుతుండగా.. నేడు ఒక్కరోజే రూ.250 పెరుగుదలను నమోదు చేశాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి
చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,440 పలుకుతుండగా.. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,650 వద్ద ట్రేడవుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,440గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,650 వద్ద ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,590 వద్ద కొనసాగుతుండగా…. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,800 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక వెండి ధరలు చూస్తే భిన్నంగా ఉన్నాయి. సిల్వర్ ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో గత కొద్ది రోజులుగా పెద్దగా మార్పులు కనిపించడం లేదు.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలోనూ ఇవే ధర కొనసాగుతోంది. బెంగళూరులో కిలో సిల్వర్ ధర రూ.2.45 లక్షల వద్ద ట్రేడవుతోంది..




