
Vaibhav Sooryavanshi: ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టిస్తుంటే, మరోవైపు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన అల్లరి చేష్టలతో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేతో వైభవ్ చేసిన సరదా సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
శివమ్ దూబే బైసెప్స్‌తో పోలిక:
నేషనల్ యాంథమ్ కోసం మైదానంలో ఆటగాళ్లందరూ లైన్‌లో నిలబడిన సమయంలో, పక్కనే నిల్చున్న ఆల్‌రౌండర్ శివమ్ దూబే భారీ కండలను (బైసెప్స్) వైభవ్ సూర్యవంశీ గమనించాడు. దూబే బాడీ చూసి ఆశ్చర్యపోయిన కుర్రాడు, వెంటనే తన సన్నటి చేతులను ఎత్తి పట్టుకుని దూబే కండలతో పోల్చితూ.. దుబే అన్నా, నీ లెక్క కండలు పెరగాలంటే నేనేం చేయాలని అడిగాడు.. ఇక వైభవ్ అమాయకపు చేష్టలను చూసి శివమ్ దూబేతో పాటు పక్కనున్న తోటి ప్లేయర్స్ కూడా పకపకా నవ్వేశారు. ఈ 15 ఏళ్ల కుర్రాడు మాట్లాడిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
మాస్కాట్ బుగ్గలు నిమురుతూ వైరల్:
* చిచ్చరపిడుగు అల్లరి: కేవలం దూబేతోనే కాకుండా, మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లతో పాటు మైదానంలోకి వచ్చిన ఒక చిన్నారి మాస్కాట్ (Mascot) బుగ్గలను వైభవ్ సరదాగా గిల్లుతూ సందడి చేశాడు.
* నెట్టింట ఫ్యాన్స్ ఫిదా: బ్యాటింగ్ వస్తే సిక్సర్ల వర్షం కురిపించే ఈ 15 ఏళ్ల క్రేజీ కిడ్, గ్రౌండ్ వెలుపల ఇంత సరదాగా ఉండటంపై క్రీడాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
* మైదానంలో తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, తన హాస్యచతురతతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వైభవ్ సూర్యవంశీ మంచి జోష్ నింపుతున్నాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Vaibhav Suryavanshi teasing Shivam Dube while comparing their arms 😂🔥
Suryavanshi be like, “Kya fayada itna GYM karne Ka, barabar hi to hai!” 🤣 pic.twitter.com/t9QHfdrMYV
— Mukku (@Cric_Mukku) September 15, 2026