Reading Time: < 1 minute
Swara Bhasker On Ayodhya Verdict Why She Apologised To Shah Rukh Salman And Aamir Khan

Swara Bhasker: వివాదాలు, హిందూ వ్యతిరేకతకు కేరాఫ్‌గా ఉన్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను బాధపడ్డానని, తీర్పు వెలువడిన తర్వాత తన ముస్లిం స్నేహితులకు మెసేజ్‌లు చేసి క్షమాపణలు చెప్పినట్లు ఆమె వెల్లడించారు.

‘‘రామ జన్మభూమి తీర్పు వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఇది ఇలాంటి దేశమా అని ఆశ్చర్యపోయా. ఆ నిర్ణయం నాకు అన్యాయం అనిపించింది. నా ఫోన్ ‌లో ఉన్న ప్రతీ ముస్లింకు మెసేజ్ చేశా. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాశన్, అమీర్ ఖాన్, ఫహద్ అహ్మద్ ఇలా అందరికీ క్షమాపణలు చెప్పాను. ఒక హిందువుగా, నాకు తెలిసిన ముస్లింలందరికీ నేను క్షమాపణలు చెప్పాలనుకున్నా. సుప్రీంకోర్టు తీర్పుతో నేను సిగ్గుపడ్డాను. ఆ తీర్పుతో నేను ఏకీభవించను’’ అని స్వరా భాస్కర్ చెప్పింది.

స్వరా భాస్కర్ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్ అయిన వెంటనే ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. చాలా మంది ఆ వ్యక్తికి చరిత్ర తెలియదా.? అని ప్రశ్నించారు. ‘‘జై శ్రీరామ్’’ అంటూ కామెంట్ చేశారు. పాడ్‌కాస్ట్‌లకు స్వరాను ఎందుకు పిలుస్తున్నారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫహాద్‌తో ఆమె పెళ్లిని కూడా ప్రజలు ట్రోల్ చేశారు. 2019లో, వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని రామ మందిర నిర్మాణానికి ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తున్న ఆమెపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని మరికొందరు డిమాండ్ చేశారు.