Reading Time: < 1 minute

దిల్‍సుఖ్‍నగర్ బహార్ బిర్యానీ కేఫ్ లో 50 కిలోల కుళ్లిన చికెన్..  వామ్మో..ఇన్నాళ్లు ఇది తిన్నామా..?

Caption of Image.

ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించిన వార్తలు చూస్తుంటేనే వణుకు పుడుతోంది. పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా జనాల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు దిల్ సుఖ్ నగర్ లోని బహార్ బిర్యానీ కేఫ్ డొల్లతనం బయటపడింది. బుధవారం ( సెప్టెంబర్ 16 ) ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.బహార్ బిర్యానీ కేఫ్ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు 50 కిలోల కుళ్లిన చికెన్ గుర్తించినట్లు తెలిపారు అధికారులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

ఈ తనిఖీల్లో 50 కిలోల కుళ్లిన చికెన్, రొయ్యలు, మటన్ తో పాటు గడువు ముగిసిన పలు ఆహార పదార్థాలు గుర్తించినట్లు తెలిపారు అధికారులు. కుళ్లిన మాంసాన్ని పారవేయించిన అధికారులు హోటల్లోని పలు ఆహార పదార్థాలు శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు.

ALSO READ : ఎయిర్ పోర్టుకు ఆనుకుని ఓ వ్యక్తికి 2 వేల ఎకరాలా..

ఈ క్రమంలో బహార్ బిర్యానీ కేఫ్ కి సంబంధించిన FSSAI లైసెన్స్ ను తక్షణమే రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అధిక లాభం కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం.

©️ VIL Media Pvt Ltd.