Reading Time: 2 minutes

వినాయక నిమజ్జనం.. ఏ రోజు ఏ సమయంలో చేయాలి.. శుభ ముహూర్తాలు ఇవే..!

Caption of Image.

దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.  సెప్టెంబర్​ 14నప్రజలు అంగరంగ వైభవంగా వినాయక చవితి పూజను జరుపుకొన్నారు. హిందువులు దాదాపు ప్రతి ఇంట్లో కూడా వినాయకుడి పూజించారు.  అయితే  3,5,7,9 రోజుల్లో వినాయకుడిని నిమజ్జనం పేరిట గంగమ్మ ఒడికి చేరుస్తారు.  10 రోజుల పాటు గణేశోత్సవాన్ని నిర్వహించే కుటుంబాలు మాత్రం అనంత చతుర్దశి రోజున గణపయ్యకు వీడ్కోలు పలుకుతారు.అయితే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఏ రోజు  ఏ సమయంలో శుభ ముహూర్తం ఉందో తెలుసుకుందాం. . .! 

3వ రోజు సెప్టెంబర్ 16:  మూడు రోజుల పాటు గణపయ్యను పూజించే కుటుంబాలు బుధవారం రోజున విగ్రహ నిమజ్జనం చేస్తారు. ఆ రోజున అనుకూల సమయాలు ఉదయం 10:43 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు, మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:25 వరకు, రాత్రి 7:53 నుంచి అర్ధరాత్రి 12:16 వరకు ఉన్నాయి. 

5వ రోజు(సెప్టెంబర్ 18): గణపతి నిమజ్జనానికి ఆ రోజున ఉదయం 6:07 నుంచి 10:43 వరకు, మధ్యాహ్నం 12:15 నుంచి 1:47 వరకు, సాయంత్రం 4:51 నుంచి 6:23 వరకు, రాత్రి 9:19 నుంచి 10:47 వరకు అనుకూల సమయాలు ఉన్నాయి. 

7వ రోజు (సెప్టెంబర్ 20): ఏడు రోజుల పాటు గణేశుడిని పూజించే కుటుంబాలు  ఆదివారం రోజున నిమజ్జనం చేస్తారు.ఉదయం 7:40 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు.. మధ్యాహ్నం 1:46 నుంచి 3:17 వరకు.. సాయంత్రం 6:20 నుంచి రాత్రి 10:46 వరకు శుభ సమయాలు ఉన్నాయి. 

అనంత చతుర్దశి రోజు( సెప్టెంబర్​25) :పది రోజుల పాటు గణేశుని ఉత్సవాలే నిర్వహించేవారు అనంత చతుర్దశి రోజున గణపయ్య విగ్రహాన్ని నిమజ్జనం చేసి భక్తులు వేడుకలకు ముగింపు పలుకుతారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న  అనంత చతుర్దశి వచ్చింది . ఆ రోజున గణపతి నిమజ్జనానికి  అనుకూల సమయాలు ఉదయం 6:11 నుంచి 10:42 వరకు, మధ్యాహ్నం 12:13 నుంచి 1:43 వరకు, సాయంత్రం 4:44 నుంచి 6:14 వరకు, రాత్రి 9:14 నుంచి 10:43 వరకు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పంచాంగం ప్రకారం .. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.