Reading Time: < 1 minute

ఫేస్‌‌బుక్ ప్రకటనకు మోసపోయిన రైల్వే ఉద్యోగి..రూ. 5.76 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

Caption of Image.

పద్మారావునగర్, వెలుగు: ఫేస్‌‌బుక్‌‌లో వచ్చిన ఇంటర్నెట్ ప్రకటనను నమ్మి ఓ రైల్వే ఉద్యోగి మోసపోయారు. సికింద్రాబాద్‌‌లోని బౌద్ధ నగర్‌‌కు చెందిన టెకి కృష్ణ ప్రకాశ్ ఈ నెల 11న ఫేస్‌‌బుక్‌‌లో గ్లోబల్ ఆర్బిట్ ఇంటర్నెట్ ప్రకటనను చూశారు. 3 నెలలు ఉచిత సర్వీస్ అంటూ దుండగులు నమ్మబలికి, స్పేస్ ఎక్స్ 6జీ మాల్​వేర్ యాప్‌‌ను ఇన్‌‌స్టాల్ చేయించారు. దానికి ఫోన్ అనుమతులు ఇవ్వగానే ఆయన మొబైల్ పనిచేయడం ఆగిపోయింది. ఆ తర్వాత బాధితుడి ఎస్‌‌బీఐ అకౌంట్, యాక్సిస్, ఫెడరల్, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల నుంచి సైబర్ కేటుగాళ్లు విడతల వారీగా రూ.5,76,400 కాజేశారు. బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
 

©️ VIL Media Pvt Ltd.