
OPPO K14 Lite: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఒప్పో (OPPO) సంస్థ భారత మార్కెట్లో ఒప్పో K14 లైట్ (OPPO K14 Lite)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మొబైల్ లో భారీ 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, IP64 రేటింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా నిర్ణయించగా.. ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్లతో రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించడంతో రూ.15,999కే కొనుగోలు చేయవచ్చు.
బ్యాటరీ 6 ఏళ్ల మన్నిక
OPPO K14 Liteలో 7,000mAh భారీ బ్యాటరీని అందించారు. కంపెనీ నిర్వహించిన పరీక్షల ప్రకారం 1,800 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ 80 శాతానికి పైగా సామర్థ్యాన్ని కొనసాగిస్తుంది. సగటున ప్రతి 1.3 రోజులకు ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు ఆరేళ్ల వరకు బ్యాటరీ పనితీరు కొనసాగుతుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ 55.55 గంటల వరకు వాయిస్ కాలింగ్, 29.99 గంటల వరకు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, 26.84 గంటల వరకు యూట్యూబ్ ప్లేబ్యాక్, 13.19 గంటల వరకు PUBG Mobile వంటి గేమింగ్‌ను అందిస్తుందని కంపెనీ అంతర్గత పరీక్షల్లో పేర్కొంది.
ఈ ఫోన్‌లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కంపెనీ పరీక్షల ప్రకారం సుమారు 30 నిమిషాల్లో 21% ఛార్జింగ్ అవుతుంది. పూర్తి 100% ఛార్జ్ కావడానికి దాదాపు 2 గంటల 52 నిమిషాలు పడుతుంది. దీంతో పాటు రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ ఉండటంతో అవసరమైనప్పుడు ఇతర పరికరాలకు కూడా ఫోన్ ద్వారా పవర్ అందించవచ్చు.
డిస్‌ప్లే
కొత్త స్మార్ట్ ఫోన్లో 6.75 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 720×1570 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. సాధారణ బ్రైట్‌నెస్ 700 నిట్స్ కాగా.. HBM మోడ్‌లో గరిష్ఠంగా 900 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. వర్షం లేదా తడి చేతులతో ఫోన్ ఉపయోగించినప్పుడు కూడా టచ్ స్పందించేలా స్ప్లాష్ టచ్, ఆయిలీ-హ్యాండ్ టచ్, గ్లోవ్ టచ్ టెక్నాలజీలను ఇందులో అందించారు.
ప్రాసెసర్..
పనితీరు కోసం 1.8GHz వరకు క్లాక్ స్పీడ్ కలిగిన Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి Mali-G57 MP1 GPU, 4GB LPDDR4X ర్యామ్, 64GB UFS 2.2 స్టోరేజ్ జత చేశారు. మైక్రోSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు విస్తరించుకోవచ్చు. భారీ పనుల సమయంలో వేడిని నియంత్రించేందుకు 13,700 చదరపు మిల్లీమీటర్ల గ్రాఫైట్ కూలింగ్ లేయర్‌ను ఫోన్‌లో ఏర్పాటు చేశారు.
కెమెరా & AI ఫీచర్లు
ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో f/2.2 అపెర్చర్‌తో 13MP ప్రైమరీ కెమెరాను అందించారు. దీనికి ఆటోఫోకస్, LED ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంటుంది. నైట్, టైమ్-లాప్స్ వంటి కెమెరా మోడ్‌లతో పాటు AI Eraser, AI Clear Face, AI Smart Image Matting 2.0 వంటి AI ఎడిటింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16పై పనిచేస్తుంది. గూగుల్ జెమినీ, గూగుల్ లెన్స్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల డేటా, మీడియా ఫైళ్ల భద్రత కోసం “ప్రైవసీ సేఫ్” ఎన్‌క్రిప్షన్ సదుపాయం కూడా ఇచ్చారు.
ఇతర ఫీచర్లు
ఫోన్‌కు IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, బాటమ్-పోర్టెడ్ స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.2, GPS, GLONASS, Galileo, QZSS, USB Type-C 2.0 కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
ధర
భారత మార్కెట్లో OPPO K14 Liteను 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే విడుదల చేశారు. దీని లిస్ట్ ధర రూ.16,999. ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించడంతో రూ.15,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. మూడు నెలల నో-కాస్ట్ EMI సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్ స్టోన్ బ్రౌన్, ఫీథర్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో అధికారిక ఈ-స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.