
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం (సెప్టెంబర్ 17) రాత్రి కారు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.