Reading Time: < 1 minute

EPFO WhatsApp : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ లో పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్స్ ట్రాక్ !

Caption of Image.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన  ఖాతాదారులకోసం అధికారికంగా వాట్సాప్ సేవలను ,EPFO WhatsApp ఛానెల్ ప్రారంభించింది. దీని ద్వారా మీ ఖాతాలో పీఎఫ్ బ్యాలెన్స్ ను వెంటనే తెలుసుకోవచ్చు. మీ ఖాతాలో జమ అయిన చివరి 5 పీఎఫ్ కాంట్రిబ్యూషన్ (లావాదేవీల) వివరాలు పొందవచ్చు.  విత్‌డ్రాయల్ లేదా అడ్వాన్స్ కోసం పెట్టిన క్లెయిమ్ ఏ దశలో ఉందో ట్రాక్ చేయొచ్చు.  పీఎఫ్ ఖాతాకు సంబంధించిన సమస్యలపై వాట్సాప్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు. లేటెస్ట్ సర్క్యులర్లు, సమాచారాన్ని ఈపీఎఫ్ వో వాట్సాప్ ఛానెల్ ద్వారా ఎప్పటికప్పుడు పొందవచ్చు.అయితే పీఎఫ్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ , క్లెయిమ్ స్టేటస్ తదితర సేవలను అందించేందుకు AI చాట్‌బాట్ సేవలను త్వరలో పూర్తిస్థాయిలో రోల్‌అవుట్ చేయనున్నారు. 

అయితే ఇంకా ఈపీఎఫ్ వో వాట్సాప్ ఛానల్ సేవలు ప్రారంభం కాలేదు.. త్వరలో ప్రారంభం కానున్నాయి. 

ఇప్పటివరకు యూఏఎన్ (UAN) పోర్టల్, ఉమాంగ్ (UMANG) యాప్ , మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ (SMS) ద్వారా బ్యాలెన్స్ తెలుసుకునే విధానం అమలులో ఉంది. ఖాతాదారులకు సేవలను మరింత సులభతరం చేసేందుకు EPFO కొత్తగా ఈ వాట్సాప్, వ్యాట్సాప్ ఛానల్ ను తీసుకొచ్చింది. 

ALSO READ : ఫేస్‌‌బుక్ ప్రకటనకు మోసపోయిన రైల్వే ఉద్యోగి..

 EPFO వాట్సాప్ ఛానెల్ ద్వారా ఖాతాదారులకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేస్తోంది. అయితే వాట్సాప్ ఛానెల్ కేవలం సమాచారం అందించే  వేదిక మాత్రమే.. దీని ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఇటీవలి ట్రాన్సాక్షన్లు చూడటం, క్లెయిమ్‌లను ట్రాక్ చేయడం వంటి ఇంటరాక్టివ్ సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.