Reading Time: < 1 minute
Meghamsh Srihari: మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ వచ్చేసింది.. శ్రీహరి కుమారుడు ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడుగా..

కొండారు శ్రీనివాసరావు సమర్పణలో క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ‘(సెప్టెంబర్ 16) ఆస్మాన్ మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.‘మీరు ఇప్పుడు గొంగలి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి.. దానికి మార్గం నేనే.. మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు.. అదే నిజం’ అంటూ అద్భుతమైన డైలాగ్స్, హీరో వాయిస్ ఓవర్‌తో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఉన్నాయి. అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా కట్ చేసిన ఈ టీజర్‌లో హీరో మేఘాంశ్ శ్రీహరి సరికొత్తగా కనిపించారు.

ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్, షోయబ్ కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, అరబిక్ భాషల్లో విడుదల చేయనున్నారు. మేఘాంశ్ శ్రీ హరితో పాటు రాయంచ, రవివర్మ, కమల్, కేశవ్ దీపక్, నిఖిల్, రాజశేఖర్, పద్మిని, ప్రేరణ గ్యాంగ్, సంతోష్, రమణ, కుమార్, సత్యరాజ్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

సాంకేతిక బృందం

బ్యానర్ : శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్
సమర్పణ : శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు
నిర్మాతలు : కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్
దర్శకుడు : రామ్‌నందన్‌
కెమెరా: షోయబ్
ఆర్ట్ డైరెక్టర్ :మణికంఠ
సీఈవో: స్వప్న కొండారు
ఎడిటర్ : నరేష్
సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్ విహారి
పోస్టర్ డిజైనర్ :ధని ఏలె
పీఆర్వో : నాయుడు-ఫణి (బియాండ్ మీడియా)

 మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా టీజర్..



 

మేఘాంశ్‌ శ్రీహరి లేటెస్ట్ ఇంటర్వ్యూ ప్రోమో..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.