
ప్రముఖ క్రికెటర్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య కొత్త చాప్టర్ ప్రారంభించింది. 52 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకుని జెమీమా గోల్డ్ స్మిత్ వార్తల్లో నిలిచింది. ఐరిష్–ఆస్ట్రేలియా వ్యాపారి, మల్టీ మిలియనీర్ అయిన కామెరాన్ ఓ రెయిల్లీని వివాహం చేసుకుంది. అటు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ జైల్లో ఉండగా.. ఈమె పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
2026 సెప్టెంబర్ రెండో వారంలో పెళ్లి జరిగినట్లు గోల్డ్ స్మిత్ ఫ్యామిలీ కన్ఫమ్ చేసింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేశారు. చాలా సంతోషంగా, కోలాహలంగా వివాహం జరిగినట్లు జెమీమా ఫ్యామిలీ పోస్ట్ చేసింది.
జెమీమా గోల్డ్ స్మిత్ – ఇమ్రాన్ ఖాన్ 2004లో విడాకులు తీసుకున్నారు. అంతుకు ముందు 9 ఏళ్ల క్రితం అంటే 1995లో వీరికి వివాహం అయ్యింది. సులేమాన్, కాసిం అనే యుద్దరు కొడుకులు ఉన్నారు.
సినిమా కలిపింది ఇద్దరినీ:
జెమీమా గోల్డ్ స్మిత్, ఓ రెయిల్లీ ఇద్దరినీ సినిమా కలిపిందనే చెప్పవచ్చు. గోల్డ్ స్మిత్ స్వయంగా ఫిల్మ్ మేకర్. ఇన్స్టింక్ట్ ప్రొడక్షన్స్ అనే కంపెనీని ప్రారంభించారు. సినిమా, టీవీ, జర్నలిజం మొదలైన రంగాల ద్వారా ఆమె కెరీర్ బిల్డ్ చేసుకున్నారు.
శేఖర్ కపూర్ రొమాంటిక్ కామెడీ వాట్ ఈజ్ లవ్ గాట్ టు డూ విత్ ఇట్.? అనే సినిమాకు రైటర్ గా, కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. న్యూ స్టేట్స్ మన్, వానిటీ ఫెయిర్ వంటి పబ్లికేషన్లకు కూడా పనిచేశారు.
సినిమా, జర్నలిజంతో పాటు మానవ హక్కులపై గోల్డ్ స్మిత్ తనవంతుగా పోరాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన మాజీ భర్త ఇమ్రాన్ ఖాన్ విషయంలో తన గొంతును పెంచుతూ వస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష పై గత నెలలో ప్రచారం నిర్వహించారు. ఇమ్రాన్ ఆరోగ్యం, హక్కులపై తన కుమారులతో కలిసి చేసిన క్యాంపెయిన్ ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. ఇది పాకిస్తాన్ రాజకీయ అంశం మాత్రమే కాదని.. ఇది మానహక్కుల కు సంబంధించిన అంశమని ఆమె ప్రచారం చేశారు.
తన మాజీ భర్త ఇమ్రాన్ ఖాన్ విషయంలో వీలైనంత పోరాటం చేసిన ఆమె ప్రచారంతో పాకిస్తాన్ ప్రభుత్వం దిగివచ్చిందనే చెప్పాలి. ఆమె పోరాటంతో ఇమ్రాన్ కు సంబంధించి ఆరోగ్య వవరాలు బయటపెట్టారు. బతికున్నాడో లేదో అనే అనుమానంతో వస్తున్న వ్యతిరేకతకు తలొగ్గిన ప్రభుత్వం.. ఎట్టకేలకు ఆయన ఆచూకీ, ఆరోగ్య వివరాలను వెల్లడించింది.