
‘ప్రేమలు’ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియా వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మలయాళంతో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే సినిమాలతో కంటే ఇప్పుడు ఓ వ్యక్తి చేసిన కామెంట్స్ కారణంగా మమితా పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేరళకు చెందిన యూట్యూబర్, ఫిలిం క్రిటిక్ సంతోష్ వర్కీ (Santhosh Varkey) చేసిన తాజా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మమితాపై సంతోష్ వర్కీ ఏమన్నాడు? గతంలో నిత్యా మీనన్ విషయంలోనూ వివాదానికి కారణమైన ఆయన కామెంట్స్ ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశంగా మారాయి? అనేది తెలుసుకుందాం..
మమితా బైజును పెళ్లి చేసుకుంటానంటూ..
సినిమాలపై తనదైన శైలిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ వర్కీ.. తాజాగా మమితా బైజుపై తనకు ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. మమితా బైజును పెళ్లి చేసుకోవాలని ఉందని, తన జీవితంలో ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చాడు.
‘‘మమితా బైజును ప్రేమిస్తున్నా. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆమె తప్ప మరో మహిళకు నా జీవితంలో చోటు లేదు’’ అంటూ సంతోష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మమితా నటించిన ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ సినిమాను మూడోసారి చూశానని, తమ మధ్య వయసు తేడా ఉన్నప్పటికీ ఆమె అంటే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. ప్రస్తుతం యూట్యూబర్ చేసిన ఈ కామెంట్స్ సొషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గతంలో నిత్యా మీనన్ విషయంలోనూ వివాదం..
సంతోష్ వర్కీ పేరు.. మొదట హీరోయిన్ నిత్యా మీనన్ విషయంలో వినిపించింది. గతంలో పెద్ద ఎత్తున సంతోష్ చేసిన కామెంట్స్ వార్తల్లో నిలిచాయి కూడా. నిత్యా మీనన్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ఆయన అప్పట్లో పలుమార్లు బహిరంగంగా మాట్లాడారు.
ఈ వ్యవహారంపై నిత్యా మీనన్ కూడా స్పందించారు. సంతోష్ వర్కీ తనను చాలా కాలం పాటు ఫాలో అయ్యారని, ఈ కారణంగా తాను, తన కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సంతోష్‌కు సంబంధించిన సుమారు 30 ఫోన్ నంబర్లను బ్లాక్ చేసినట్లు కూడా నిత్యా తెలిపింది.
అయితే ఈ వివాదంపై సంతోష్ వర్కీ కూడా తర్వాత స్పందించాడు. నిత్యా మీనన్ విషయంలో తన ప్రవర్తన కొంత హద్దు దాటిందని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని చెబుతూ పోస్ట్ పెట్టాడు. తనకు హీరోయిన్ నిత్యా మీనన్ పై నిజమైన అభిమానం ఉండేదని, అయితే ఆ విషయం ఇప్పుడు ముగిసిపోయిందని చెప్పుకొచ్చాడు.
‘ఆరట్టు అన్నన్’గా గుర్తింపు..
సంతోష్ వర్కీ మలయాళంలో సినిమా రివ్యూలు, తన ప్రత్యేకమైన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. మోహన్‌లాల్ నటించిన ‘ఆరట్టు’ సినిమాపై ఆయన చేసిన రివ్యూ వైరల్ కావడంతో ‘ఆరట్టు అన్నన్’ అనే పేరుతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఇచ్చే సినిమా రివ్యూలు, సోషల్ మీడియా పోస్టులు తరచూ చర్చనీయాంశంగా మారుతున్నాయి.
‘ప్రేమలు’తో మమితాకు భారీ క్రేజ్…
ఇక మమితా బైజు విషయానికి వస్తే.. ‘ప్రేమలు’ సినిమా ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఇందులో రీను పాత్రలో ఆమె నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మమితా.. ఆ తర్వాత ఇతర దక్షిణాది భాషల్లోనూ సినిమాలు చేస్తూ తన మార్కెట్‌ను విస్తరించుకుంటోంది.
ఇటీవలే ‘జన నాయగన్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ వంటి చిత్రాలతో సాలిడ్ సక్సెస్ అందుకుంది. ఇక ప్రస్తుతం సంతోష్ వర్కీ చేసిన కామెంట్స్ తో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై మమితా బైజు నుంచి ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ రాలేదు. చూడాలి ఎలా స్పందిస్తుందో!