Reading Time: < 1 minute

గూగుల్ జెమిని స్పార్క్: ఇకపై మీ పనులన్నీ అదే చూసుకుంటుంది!

Caption of Image.

గూగుల్ సంస్థ భారతదేశంలో ‘జెమిని స్పార్క్’ (Gemini Spark) అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సాధారణ చాట్‌బాట్‌లా మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాకుండా, ఇది ఒక పర్సనల్  అసిస్టెంట్ లాగా మన పనులను స్వయంగా చేస్తుంది.

ఎలా పనిచేస్తుందంటే 
ఇది గూగుల్ క్లౌడ్ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి మనం ల్యాప్‌టాప్ ఆఫ్ చేసినా లేదా ఫోన్‌ లాక్‌ చేసి ఉన్నా సరే.. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో దాని  పని అది చేసుకుంటూనే ఉంటుంది.

వర్క్‌స్పేస్‌తో కనెక్ట్: ఇది Gmail, Google Docs, Sheets, Calendar వంటి గూగుల్ యాప్‌లతో డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది.

ఫుల్ కంట్రోల్ మీ చేతిలోనే:  జెమినీ స్పార్క్ కు ఏ యాప్స్ కి యాక్సెస్ ఇవ్వాలి, ఏ పనులు చేయనివ్వాలి అనేది పూర్తిగా మీ ఇష్టమే. కావాలనుకుంటే ఎప్పుడైనా దీనికి ఇచ్చిన  యాక్సెస్ మార్చుకోవచ్చు లేదా డిసేబుల్/ ఆఫ్ చేయవచ్చు. ===================

జెమినీ స్పార్క్ ఎం చేయగలదు 

ట్రిప్ ప్లానింగ్: మెయిల్స్‌లో ఉన్న ఫ్లయిట్, హోటల్ బుకింగ్స్‌ను గుర్తించగలదు. అలాగే గూగుల్ షీట్స్‌లో టూర్ ప్లాన్ రెడీ చేయగలదు, ఇంకా  క్యాలెండర్‌లో ఈవెంట్లను షెడ్యూల్ చేయగలదు. వీకెండ్లో జరిగే ఈవెంట్లను వెతకడం, పెళ్లికి వచ్చే అతిథుల వివరాలు మేనేజ్ చేయడం.

ALSO READ : పిల్లలు తినే పాస్తాలో బొద్దింక

సబ్‌స్క్రిప్షన్స్ మేనేజ్‌మెంట్: సబ్‌స్క్రిప్షన్ ధరలు పెరిగితే గమనించడం, క్యాన్సల్  చేసే ఈమెయిల్స్‌ను రెడీ చేయడం.

ఇతర పనులు: కస్టమర్ల మెసేజులకు  రిప్లైలు డ్రాఫ్ట్ చేయడం వంటి ఎన్నో పనులను మనం  అడగాల్సిన పని లేకుండా  ఆటోమేటిక్‌గా పూర్తి చేస్తుంది.

ఈ ఫీచర్ ఎవరికి 
ప్రస్తుతానికి ఈ ఫీచర్ భారతదేశంలోని గూగుల్ AI ప్రో (Google AI Pro), గూగుల్ AI అల్ట్రా (Google AI Ultra) సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే.  రాబోయే రోజుల్లో దశలవారీగా అందరికి అందుబాటులోకి రావొచ్చు. ఉచితంగా జెమిని వాడేవారి కోసం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.
 

©️ VIL Media Pvt Ltd.