పసిడి ప్రియులకు ఇదో శుభవార్తనే చెప్పాలి.. ఎందుకంటే గతకొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికన్ డాలర్ బలపడటంతో పాటు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో పెట్టుబడి దారులు వెనకడుగు వేయడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1.3 శాతం క్షీణించి ఔన్స్‌కు 4,291.71 డాలర్ల వద్దకు చేరింది. అలాగే వెండి సుమారు 3శాతం తగ్గి ఔన్స్‌కు 62.82 డాలర్లకు పడిపోయింది. ఇక ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చూసుకుంటే.. 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,54,080 వద్ద ట్రేడవుతుంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,240 వద్ద ట్రేడువుతుంది. ఇక వెండి విషయానికి వస్తే ప్రస్తుతం కేజీ వెండి ధరల రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు సెట్టుబడి దారులను సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీశాయి. దీంతో బంగారం, వెండి రెండూ వరుసగా మూడో వారం కూడా నష్టాలను నమోదు చేశాయని ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ ముడ్రెక్స్కు చెందిన లీడ్ క్వాంట్ అనలిస్ట్ అక్షత్ సిద్ధాంత్ తెలిపారు. దీంతో ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
మరో కారణం ఏమిటంటే సౌదీ అరేబియా ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌పై డ్రోన్ దాడుల కారణంగా చరుకు సరఫరా నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 103 డాలర్లకు చేరింది. ఇది ద్రవ్యోల్బణ భయాలను పెరిగి బంగారం, వెండికి ఉన్న డిమాండ్ తగ్గిందని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల కూడా ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచవచ్చని ANZ బ్యాంక్ పేర్కొంది. అంతేకాదు రాబోయే రోజుల్లో పెడరల్ రిజర్వే రేట్స్ పెరగొచ్చని.. అప్పుడు బంగారం ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని తెలిపారు.
కానీ ప్రస్తుతం ఈ ధరలు తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఇలానే కొనసాగితే బంగారానికి సురక్షిత పెట్టుబడిగా డిమాండ్ పెరుగుతుందని దీంతో ధరలు కూడా పెరగొచ్చని ANZ బ్యాంక్ తెలిపింది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెరుగుతున్న పెట్టుబడులు, చైనా సంస్థాగత కొనుగోళ్లు, భారతదేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటే రాబోయే ఏడాదిలో బంగారం ధర ఔన్స్‌కు 5,400 డాలర్లకు చేరేఛాన్స ఉందని అంచనా వేసింది. అంటే దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని ఇప్పుడే హింట్ ఇచ్చింది.




