
Vaibhav Sooryavanshi: మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ల అంతర్జాతీయ అరంగేట్రం (Debut) చేసి.. సచిన్ టెండూల్కర్, షఫాలీ వర్మల ఆల్-టైమ్ రికార్డులను తిరగరాసిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ అయిపోంగనే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు, సీనియర్ ప్లేయర్లకు థాంక్స్ చెప్తూ ఒక హార్ట్ టచింగ్ పోస్ట్ పెట్టిండు. ఐపీఎల్‌లో రచ్చ చేసినా ఐర్లాండ్ టూర్ల బెంచ్‌కే పరిమితమైన వైభవ్.. మొత్తానికి ఇంగ్లాండ్ సిరీస్‌ల బ్లూ జెర్సీ వేసుకునే ఛాన్స్ కొట్టేసిండు. ఈ మ్యాచ్‌లో అతడు 10 బంతుల్లో 14 రన్స్ చేసి అవుట్ అయినా.. మ్యాచ్ మొత్తం అతడి గురించే మాట్లాడుకున్నారు.
నా దేశానికి ఆడటం నా అదృష్టం:
ఇండియా జెర్సీ వేసుకున్న తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి వైభవ్ ఇట్లా రాసుకొచ్చాడు.. మీరందరూ పంపిన మెసేజ్‌లు చూసి నా మనసు నిండిపోయింది.. నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ సపోర్ట్ చేసిన నా వెల్-విషర్స్ అందరికీ, సీనియర్స్ కి పెద్ద థాంక్స్.. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. జట్టు కోసం ప్రతిసారి నా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తా.. థాంక్యూ సో మచ్ ఎవ్రీవన్! అని పేర్కొన్నాడు. వైభవ్ పోస్టుపై క్రికెట్ ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతూ, భవిష్యత్తులో మరిన్నీ రికార్డులు నెలకొల్పాలని చెప్పుకొచ్చారు.
చేతులారా మ్యాచ్‌ని పోగొట్టుకున్న భారత్:
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 190 రన్స్ కొట్టినా.. బౌలర్ల వల్ల ఇంగ్లాండ్ ఇంకొక ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో మ్యాచ్‌ని చేజార్చుకుంది. ఫస్ట్ ఓవర్లనే అర్ష్‌దీప్ సింగ్ ఇద్దరు ఇంగ్లాండ్ ఓపెనర్లను డకౌట్ చేసి ఊపు తెచ్చినా.. ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ (15 బంతుల్నే 39 రన్స్) మ్యాచ్‌ని మలుపు తిప్పిండు. అలాగే వన్-డౌన్ లో వచ్చిన జాకబ్ బెథెల్ 46 బంతుల్లో 76 రన్స్ కొట్టి నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ని గెలిపించిండు. ఇక రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ల రెండు నో-బాళ్లు, రెండు ఫ్రీ హిట్లతో ఏకంగా 29 రన్స్ రావడమే భారత జట్టు ఓటమిని కన్ఫర్మ్ చేసింది.
A historic moment! 🌟#IrfanPathan believes #VaibhavSooryavanshi‘s historic debut is a landmark moment for Indian cricket and backs him to have a bright future ahead. 👏✌️#ENGvIND 👉 3rd T20I | TUE, JUL 7, 9 PM on JioHotstar pic.twitter.com/zbmzvRXVSd
— Star Sports (@StarSportsIndia) July 5, 2026