
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. 2026, జూన్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ అధ్యయన బాధ్యతలు ఎస్బీఐ క్యాప్స్‌కు అప్పగించాలని కోరారు.
ఇందుకు సంబంధించిన షరతులు, విధివిధానాలు వెంటనే ఖరారు చేయాలన్నారు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ టేకోవర్, రెండో దశ అనుమతులు జాప్యం అవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రులను లేఖల్లో కోరారు.