Reading Time: < 1 minute
‘ఎబోలా ‘ కలకలం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్

ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే ఎయిర్‌పోర్ట్ హెల్త్ కియోస్క్‌ లో హెల్త్ చెక్‌ చేయించుకోవాలి. ప్రస్తుతం ఆఫ్రికాలో వందలాది కేసులు, 130 కి పైగా మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ, అధిక జనాభా కలిగిన నగరాల్లో వైరస్ వ్యాపించకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు జ్వరం, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే అధికారులకు సమాచారం అందించాలి. కొందరికి మూడు వారాల వ్యవధిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాప్తిస్తున్న ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ లక్షణాలు సాధారణ ఫ్లూ, టైఫాయిడ్, మలేరియాను పోలి ఉండటం వల్ల దీనిని గుర్తించడం వైద్యులకు సవాలుగా మారింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ‘జైర్’ స్ట్రెయిన్‌ను అడ్డుకోవడానికి రూపొందించినవి. దీంతో ప్రస్తుత కొత్త వేరియంట్‌పై ఇవి ప్రభావవంతంగా పని చేయడం లేదు. పుణెలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ’ని ప్రధాన టెస్టింగ్‌ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్‌పోర్టుల్లో అనుమానిత లక్షణాలు ఉన్నవారిని నేరుగా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేసారు. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం సూచించింది.

మరిన్ని వీడియో కోసం : 

న్యూ రికార్డ్స్ ను టార్గెట్ చేస్తున్న రామాయణ!

జాన్వీ కపూర్ కోలీవుడ్ డెబ్యూ

చాలా ఏళ్లుగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆమిర్‌ఖాన్

దృశ్యం 3 హిట్టా..? ఫట్టా..?