
PM Modi in Telangana Live: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు ఐదు గంటల పాటు నగరంలో గడపనున్న ప్రధాని, వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.