Reading Time: < 1 minute

రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో జీవా

Caption of Image.

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత, టాలీవుడ్లో ఎన్నో మరపురాని సినిమాలు తెరకెక్కించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్‌బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజస్తాన్లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్‌బీ చౌదరి మృతి చెందిన ఘటన టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో కూడా పెను విషాదం నింపింది.

‘రంగం’ సినిమా హీరో జీవా తన తండ్రి ఆర్బీ చౌదరి ఇలా దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పుట్టెడు దు:ఖంలో కూరుకుపోయారు. పలు భాషల్లో 90కి పైగా సినిమాలను ఆర్ బీ చౌదరి నిర్మించారు. ఆర్బీ చౌదరి కుటుంబం చెన్నైలోనే నివాసం ఉంటుంది.

రాజస్తాన్లోని ఉదయ్పూర్లో యాక్సిడెంట్ జరిగిన విషయం తెలియగానే జీవా కుటుంబం హుటాహుటిన చెన్నై నుంచి రాజస్తాన్కు బయల్దేరి వెళ్లింది. ఈ యాక్సిడెంట్ కు కారణాలు తెలియలేదు. యాక్సిడెంట్ దృశ్యాలను గమనిస్తే కారు డ్రైవర్ అతి వేగంగా డివైడర్ను ఢీ కొట్టినట్లు స్పష్టంగా కనిపించింది. 

►ALSO READ | సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతి

ఆర్బీ చౌదరి స్వయంగా కారు నడిపారా లేదా డ్రైవర్ డ్రైవ్ చేశాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్ చూస్తుంటే.. రాజస్తాన్లోని లోకల్ వెహికల్ అని అర్థమవుతుంది. ఆయన బిజినెస్ పని మీద ఉదయ్ పూర్ వెళ్లారా లేక ఏదైనా షూటింగ్ కోసం వెళ్లారనే విషయంలో స్పష్టత లేదు.

©️ VIL Media Pvt Ltd.