July 14, 2026

HCA క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా అంబటి రాయుడు

HCA క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా అంబటి రాయుడు
Reading Time: < 1 minute

HCA క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా అంబటి రాయుడు

Caption of Image.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో సంస్కరణల దిశగా అడుగులు పడ్డాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడును క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా నియమించారు. 2026 మే 05వ తేదీన 
ఉప్పల్‌ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్నాథ్, కార్యదర్శి జీవన్ రెడ్డి.

ఈ సందర్భంగా భారత మాజీ అంతర్జాతీయ క్రికెటర్ అంబటి రాయుడును క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా నియమించినట్లు ప్రకటించారు …

క్రికెట్ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, అవినీతి నిరోధక చర్యలకు మరింత బలం చేకూర్చేందుకు హెచ్‌సీఏ ప్రత్యేక యాంటీ-కరప్షన్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ యూనిట్‌ కు చైర్మన్‌గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ విజేందర్ పింగలే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు.

►ALSO READ | DC vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. చెన్నై ముందు భారీ టార్గెట్ తప్పదా !

క్రికెట్‌ కు సంబంధించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ వెల్లడించింది . 

 హెచ్‌సీఏ లీగ్ సీజన్ 2026–27ను మే 12 నుంచి ప్రారంభించనున్నారు. మొదటగా A & B డివిజన్ టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు . హెచ్‌సీఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ఆధునిక శిక్షణ సౌకర్యాలు కల్పించేందుకు సంకల్పించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, జిల్లా స్థాయి ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. మొత్తంగా ఈ నిర్ణయాలతో హెచ్‌సీఏలో పారదర్శకత, ప్రొఫెషనలిజం పెరగనుందని భావిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.