
ఐపీఎల్ 2026లో భాగంగా 2026 మే 05న జరుగుతున్న 48వ మ్యాచ్ లో..ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెరో 8 పాయింట్లతో సమంగా ఉన్న రెండు టీమ్స్ గెలుపు కోసం ఆరాటపడుతున్నాయి. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై భారీ ఛేజింగ్ చేసి గెలిచిన ఢిల్లీ.. చెన్నైపై గెలిచేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది.
రెండు టీమ్స్ నాలుగు గెలుపులు, 5 ఓటములతో సమానమైన పాయింట్లతో కొనసాగుతున్నాయి. ప్లేఆఫ్ రేస్ లో ప్రతి మ్యాచ్ గెలవాల్సిన సందర్భంగా తప్పక గెలవాలనే కసితో రెండు టీమ్స్ బరిలోకి దిగుతున్నాయి.
గాయం కారణంగా దూరమైన ఢిల్లీ బౌలర్ లుంగీ ఎంగిడీ ఇవాళ్టి మ్యాచ్ లో అందుబాటులోకి వచ్చాడు. దీంతో ఢిల్లీ బౌలింగ్ బలంగా మారిందనే చెప్పాలి.
కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ తో ఢిల్లీ గెలుపుపై ధీమాగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు రాజస్థాన్ రాయల్ పై 226 పరుగుల లక్ష్యాన్ని ఛేందించి.. కాన్ఫిడెన్స్ తో కనిపిస్తోంది . ఈ మ్యాచ్ లో కే ఎల్ రాహుల్.. 40 బంతుల్లో 75 రన్స్ చేసి ఢిల్లీ గెలుపులో కీలక పాత్ర వహించాడు .
ప్లేయింగ్ XI:
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI: సంజూ శాంసన్ (WK), రుతురాజ్ గైక్వాడ్ (c), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, KL రాహుల్ (WK), కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, నితీష్ రాణా, అక్షర్ పటేల్ (c), అశుతోష్ శర్మ, లుంగి న్గిడి, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్
ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్:
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, మాథ్యూ షార్ట్, ఆకాష్ మధ్వాల్, సర్ఫరాజ్ ఖాన్
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్స్: విప్రజ్ నిగమ్, సమీర్ రిజ్వీ, అభిషేక్ పోరెల్, అఖిబ్ నబీ దార్, డేవిడ్ మిల్లర్